Supreme Court On Amaravati : రేపు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి అంశంపై విచారణ, సర్వత్రా ఉత్కంఠ

అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని కెవియెట్ పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి రైతులు. 2వేల పేజీలతో ఎస్ఎల్పీ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Supreme Court On Amaravati : రేపు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి అంశంపై విచారణ, సర్వత్రా ఉత్కంఠ

Supreme Court On Amaravati : అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని కెవియెట్ పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి రైతులు. 2వేల పేజీలతో ఎస్ఎల్పీ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని ఎస్ఎల్పీలో సుప్రీంకోర్టును కోరింది వైసీపీ సర్కార్. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని రాష్ట్ర ప్రభుత్వం వాదన.హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొంది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని తన పిటిషన్ లో వైసీపీ సర్కార్ ప్రస్తావించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్ లో తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని తన పిటీషన్ లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.