Chandrababu Naidu: “అప్పటి ప్రధాని వాజ్‌పేయి రావడం మరిచిపోలేని సంఘటన”

 ISB 20 ఏళ్ల వార్షికోత్సవంలో పాల్గొనబోతున్నానంటూ చంద్రబాబు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ISB శంకుస్థాపన, ప్రారంభోత్సవ ఫొటోలను పోస్టు చేశారు.

Chandrababu Naidu: “అప్పటి ప్రధాని వాజ్‌పేయి రావడం మరిచిపోలేని సంఘటన”

Chandrababu Naidu

Updated On : May 26, 2022 / 4:08 PM IST

Chandrababu Naidu: ISB 20 ఏళ్ల వార్షికోత్సవంలో పాల్గొనబోతున్నానంటూ చంద్రబాబు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ISB శంకుస్థాపన, ప్రారంభోత్సవ ఫొటోలను పోస్టు చేశారు.

ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షికోత్సవానికి ప్రధాని మోడీ హాజరవుతున్నందుకు అభినందనలు తెలిపారు.

2001లో ISB ప్రారంభోత్సవానికి నాటి ప్రధాని వాజ్ పేయి రావడం మరిచిపోలేని సంఘటనని అభివర్ణించారు.

Read Also: కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే: చంద్రబాబు

“90వ దశకంలోనే గచ్చిబౌలి ప్రాంతాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశాం. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ISB వాళ్ల రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకోవడానికి పోటీ పడ్డాయని” వివరించారు.

“హైదరాబాదులో ISB ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ISB బోర్డును ఒప్పించగలిగాం. ISB దినదినాభివృద్ధి భవిష్యత్ బిజినెస్ లీడర్సును అందిస్తుందని కోరుకుంటున్నా” అని ఆకాంక్షించారు.