CM Jagan : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్‌.. తాజా పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయకచర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు.

CM Jagan : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

Cm Jagan

CM Jagan aerial survey : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహంచారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వర్షాలు, వరదల కారణంగా ఏ ఏ ప్రాంతాలు నీట మునిగాయి. ఎంత నష్టం జరిగిందనే అంశాలను పరిశీలించారు. సీఎం జగన్‌ వెంట హోంమంత్రి తానేటి వనిత, మంత్రి విశ్వరూప్‌ ఉన్నారు. ఇప్పటికే వరదల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం జగన్.. ఏరియల్ సర్వే ద్వారా స్వయంగా పరిశీలించారు.

గోదావరి విశ్వరూపానికి ఏపీలోని లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. భారీ వానలు ముంచెత్తుతున్నాయి. అదే సమయంలో ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదతో ప్రస్తుతం గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భారీ వరదల కారణంగా ఊరూవాడా ఏకం చేస్తోంది. ముఖ్యంగా లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది.

Polavaram Villages : గోదావరి ఉధృతి..పోలవరం దగ్గర ముంపునకు గురైన పలు గ్రామాలు

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన సీఎం జగన్‌.. తాజా పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయకచర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు.

వర్షాలు, వరదలతో ఏ ఏ ప్రాంతాలు నీట మునిగాయి.., ఎంత నష్టం జరిగిందో ముఖ్యమంత్రికి మంత్రులు వివరించారు. ఏరియల్‌ సర్వేతో వరద బీభత్సాన్ని చూసిన సీఎం జగన్‌.. అధికారులు, కలెక్టర్లను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. బాధితులకు సాయం, వరద మరింతగా పెరిగేకొద్దీ గండ్లు పడకుండా, ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేపట్టారు.