Polavaram Villages : గోదావరి ఉధృతి..పోలవరం దగ్గర ముంపునకు గురైన పలు గ్రామాలు

కివ్వాక ఆర్ &ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద మంచి నీరు, విద్యుత్, టాయిలెట్ల సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. రేషన్ విషయంలో కొంతమందికి ఇచ్చి మరికొంత మంది బాధితులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన చెందారు.

Polavaram Villages : గోదావరి ఉధృతి..పోలవరం దగ్గర ముంపునకు గురైన పలు గ్రామాలు

Village

Updated On : July 15, 2022 / 5:39 PM IST

Polavaram villages : గోదావరి ఉధృతితో పోలవరం దగ్గర పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు గ్రామాల ప్రజలు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పునరావాస కేంద్రాలకు వచ్చారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కివ్వాక ఆర్ &ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద మంచి నీరు, విద్యుత్, టాయిలెట్ల సౌకర్యాలు లేవని మండిపడుతున్నారు. రేషన్ విషయంలో కొంతమందికి ఇచ్చి మరికొంత మంది బాధితులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన చెందారు. అంచనాలకు మించి పునరావాస కేంద్రాలకు ప్రజల రావడంతో కొద్ది మేరకు అసౌకర్యం కలుగుతుందోని అధికారులు అంటున్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు.
Kaleswaram : భారీ వరదలకు నీట మునిగిన కాళేశ్వరం పంప్ హౌజ్‌లు

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం వద్ద 16లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయితే 31,382 కుటుంబాలపై ప్రభావం పడుతుంది. ప్రజలు ఒప్పుకోక పోతే బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.