AP CM JAGAN: నేడు తిరుపతికి సీఎం జగన్ .. పలు అభివృద్ధి పనులు ప్రారంభం.. |CM Jagan arrives in Tirupati today

AP CM JAGAN: నేడు తిరుపతికి సీఎం జగన్ .. పలు అభివృద్ధి పనులు ప్రారంభం..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. నూతన జిల్లాల ఆవిర్భావంలో భాగంగా తిరుపతి జిల్లాగా ఏర్పాటైన విషయం విధితమే. కాగా తిరుపతి జిల్లా ఏర్పాటైన తొలిసారి..

AP CM JAGAN: నేడు తిరుపతికి సీఎం జగన్ .. పలు అభివృద్ధి పనులు ప్రారంభం..

AP CM JAGAN: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. నూతన జిల్లాల ఆవిర్భావంలో భాగంగా తిరుపతి జిల్లాగా ఏర్పాటైన విషయం విధితమే. కాగా తిరుపతి జిల్లా ఏర్పాటైన తొలిసారి సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విద్యా దీవెన పథకం సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.45 గంటలకు సీఎం జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.05 గంటలకు హెలిపాడ్ (ఎస్ వి వెంటర్నరీ కళాశాల) వద్దకు చేరుకుంటారు. 11.20 గంటలకు ఎస్.వి. స్టేడియంకు చేరుకొని విద్యా దీవెన బహిరంగ సభలో పాల్గొంటారు. విద్యా దీవెన పథకం కింద జనవరి – మార్చి త్రైమాసానికి సంబంధించి నగదును జగన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10.85 లక్షల మంది విద్యార్థులకు 709 కోట్ల రూపాయలు అందించనుండగా.. ఒక్క బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

CM Jagan : మే 5న తిరుపతిలో టీటీడీ అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు సీఎం జగన్ శంఖుస్థాప‌న

అనంతరం సీఎం జగన్ మధ్యాహ్నం 12.25 గంటలకు అలిపిరి వద్ద శ్రీ పద్మావతి చిన్న పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంకు శంకుస్థాపన చేస్తారు. తిరుపతిలోని అలిపిరి వద్ద 300 కోట్ల అంచనా వ్యయంతో ఆరెకరాల స్థలంలో టీటీడీ చిన్న పిల్లల ఆస్పత్రిని నిర్మించనుంది. అన్ని రకాల స్పెషాలిటీ విభాగాలతో, అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందేలా చిన్న పిల్లల ఆస్పత్రిని టీటీడీ నిర్మించనుంది. ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ 1.40 గంటలకు టాటా కాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. 120 కోట్ల భారీ వ్యయంతో జూపార్క్ రోడ్డులో టాటా ట్రస్ట్ అధునాతన క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించింది. అనంతరం అక్కడే ఇదివరకే నిర్మాణం పూర్తయిన శ్రీనివాస సేతు ప్లై ఓవర్ శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకొని తిరుగు పయణమవుతారు. 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

×