CM Jagan : మే 5న తిరుపతిలో టీటీడీ అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు సీఎం జగన్ శంఖుస్థాప‌న

శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాప‌న చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుప‌త్రి నిర్మించనున్నారు.

CM Jagan : మే 5న తిరుపతిలో టీటీడీ అభివృద్ధి కార్య‌క్ర‌మాలకు సీఎం జగన్ శంఖుస్థాప‌న

Jagan (2)

CM Jagan : తిరుప‌తిలో టీటీడీకి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ మే 5 బుధ‌వారం ప్రారంభోత్స‌వాలు, శంఖుస్థాప‌న చేయనున్నారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో ముఖ్య‌మంత్రి జగన్ శంఖుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేయనున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న కోసం టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటి ఆసుప‌త్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాప‌న చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుప‌త్రి నిర్మించనున్నారు.

ఇందులో ఏడు అంతస్తులు, 350 పడకలు ఉంటాయి. ఈ ఆసుప‌త్రిలో చిన్నారులకు అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు. హెమ‌టో ఆంకాల‌జి, మెడిక‌ల్ ఆంకాల‌జి, స‌ర్జిక‌ల్ ఆంకాల‌జి, న్యూరాల‌జి, కార్డియాల‌జి, నెఫ్రాలాజి, గ్యాస్ట్రో ఎంట్రాలజి లాంటి 15 రకాల ప్ర‌త్యేక విభాగాల్లో చిన్నారులకు వైద్య సేవ‌లు, చికిత్స‌లు అందిస్తారు. అంతేగాక అత్యంత ఖరీదైన బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మరియు ఇతర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేస్తారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఇలాంటి ఆసుప‌త్రి దేశంలోనే మొద‌టిది కాబోతుంది.

Tirumala : మే 5 నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి-టీటీడీ

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బ‌ర్డ్‌లో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ వార్డులు ప్రారంభించనున్నారు. మిష‌న్ హెల్త్ ఫ‌ర్ ఆల్ ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ పేద‌ల చెంత‌కు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావ‌డానికి అనేక చ‌ర్య‌లు తీసుకుంది. ఈక్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్మైల్ ట్రైన్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థతో క‌లిసి గ్ర‌హ‌ణ మొర్రి భాధితుల‌కు ఉచితంగా అధునాతన చికిత్స, వైద్య సేవ‌ల‌ను అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది. చికిత్స తర్వాత వీరికి స్పీచ్ థెరపీ, బీహేవియ‌ర‌ల్ కౌన్సెలింగ్ అందిస్తారు. దీనివల్ల వీరు కూడా మనోధైర్యంతో అందరిలాగే సాధారణ జీవితం గడిపే అవకాశం కలుగుతుంది.

శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ అఫ్ క్యాన్స‌ర్ కేర్ అండ్ అడ్వాన్స్ రిసెర్చ్ (స్వీకార్‌) ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక లక్షా 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 కోట్ల రూపాయల వ్యయంతో విశాలమైన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. రోగులకు కావలసిన అన్ని వసతులు సమకూరుస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవ‌లు అందించే ఈ ఆసుప‌త్రిలో మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ లాంటి క్యాన్సర్లకు వైద్యసేవలు అందిస్తారు. ఈ ఆసుపత్రిలో 92 ఇన్‌పేషెంట్‌ పడకలతో నూత‌న భ‌వ‌నాల‌ను నిర్మించింది.

Tirumala: తిరుమలలో ఈనెల విశేష ఉత్సవాలివే

తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఆదర్శవంతమైన ప‌విత్ర యాత్రాస్థ‌లంగా మార్చడానికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. 2022 జనాభా లెక్కల ప్రకారం తిరుపతి కార్పొరేష‌న్ జనాభా 7.29 ల‌క్ష‌లు. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం ప్ర‌పంచ న‌లుమూల‌ల నుండి ప్ర‌తి రోజు ల‌క్ష‌మందికి పైగా భ‌క్తులు తిరుప‌తికి వ‌స్తున్నారు. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు, స‌దుపాయాలు క‌ల్పించ‌డంతో పాటు సులువుగా తిరుమ‌ల‌కు చేరుకునేందుకు టీటీడీ శ్రీ‌నివాస సేతు నిర్మాణంలో కీల‌క భాగ‌స్వామి అయ్యింది.

తిరుప‌తి న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం తిరుపతి స్మార్ట్‌సిటీకార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వ‌ర్యంలో 6.86 కిమీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింది. ఇందుకోసం రూ.684 కోట్ల అంచ‌నావ్య‌యంతో 2019 మార్చి 6వ తేదీ శ్రీ‌నివాస సేతు నిర్మాణానికి ప‌నులు ప్రారంభించారు. మొద‌టి ద‌శ‌లో శ్రీ‌నివాసం స‌ర్కిల్ నుండి వాస‌వి భ‌వ‌న్ స‌ర్కిల్ వ‌ర‌కు 3 కి.మీ మేర వంతెన నిర్మాణం పూర్త‌యింది. శ్రీనివాససేతు మొద‌టి ద‌శ వంతెనను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.