CM Jagan : పంట కొనుగోళ్లపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

CM Jagan : పంట కొనుగోళ్లపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

Cm Jagan

CM Jagan : ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని తెలిపారు. కచ్చితంగా రైతుకు కనీస మద్దతు ధర దక్కాలని రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యం దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషిచేయాలను సూచించారు సీఎం జగన్.

చదవండి : CM Jagan West Godavari : రేపు గృహహక్కు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్

రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు.. ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదు.. తరచుగా రైతులతో ఇంటరాక్ట్‌ అవ్వాలి.. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవని.. రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు.. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి.. ధాన్యం నాణ్యతా పరిశీనలో రైతులు మోసాలకు గురికాకూడదని అధికారులకు సూచించారు.

చదవండి : CM Jagan : బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చూడాలని.. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలి.. టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలని సూచించారు సీఎం. ప్రతి ఆర్బీకేలో కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి.. వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్‌ అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని వివరించారు. గన్నీబ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలని.. వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని తెలిపారు సీఎం జగన్. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి అధికారులను ఆదేశించారు.

చదవండి : CM Jagan : ఆదాయం తగ్గింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది

 

cm jagan, conduct meeting, food and agriculture officers,  paddy purchase, andhrapradesh agriculture