Jagan Delhi Tour : జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. యధావిధిగా కేబినెట్ భేటీ

సీఎం జగన్ రేపటి (శుక్రవారం) ఢిల్లీ పర్యటన రద్దైంది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని సీఎంవో ప్రకటించింది. ఉదయం 11గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశానికి మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించింది.

Jagan Delhi Tour : జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. యధావిధిగా కేబినెట్ భేటీ

Jagan Delhi Tour

Jagan Delhi Tour : సీఎం జగన్ రేపటి (శుక్రవారం) ఢిల్లీ పర్యటన రద్దైంది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని సీఎంవో ప్రకటించింది. ఉదయం 11గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశానికి మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

శుక్రవారం ఉదయం 11గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మంత్రులంతా ఈ భేటీకి హాజరవ్వాలని సీఎంవో ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటే మంత్రులందరికి కూడా సమాచారం ఇచ్చింది. సీఎం జగన్ శుక్రవారం ఢిల్లీ వెళ్లబోతున్నట్లుగా గురువారం సాయంత్రం వార్తలు వచ్చాయి. దీన్ని సీఎంవో కూడా ధృవీకరించింది.

Perni Nani : మోదీని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు : మాజీ మంత్రి పేర్ని నాని

ఇంతలోనే తన ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్న జగన్.. కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే అందరికీ కూడా సమాచారం ఇవ్వటం జరిగింది. శుక్రవారం జగన్ ఢిల్లీ వెళ్తారని, ఢిల్లీలో కీలక వ్యక్తులతో సమావేశం కానున్నారని ముందుగా వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా అంటూ సమాచారం వచ్చిన నేపథ్యంలో.. కాసేపటి క్రితం.. ఢిల్లీ టూర్ పూర్తిగా రద్దు అయినట్లు, కేబినెట్ భేటీ యధావిధిగా జరుగుతుందని సీఎంవో నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. అధికారుల తీరుపట్ల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దీంతో మంత్రులంతా రేపటి కేబినెట్ సమావేశానికి రాబోతున్నారు. మంత్రివర్గ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. దానిపై ఓ నిర్ణయం కూడా తీసుకోనున్నారని సమాచారం.