CM Jagan Debts : చంద్రబాబు వల్లే అప్పుల భారం, పాపాలు వెంటాడుతున్నాయి-సీఎం జగన్

చంద్రబాబు ఐదేళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకెళ్లారని, రూ.39 వేల కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు.(CM Jagan Debts)

CM Jagan Debts : చంద్రబాబు వల్లే అప్పుల భారం, పాపాలు వెంటాడుతున్నాయి-సీఎం జగన్

Cm Jagan Debts

CM Jagan Debts : రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి ఆశించిన స్ధాయిలో పెరగకపోయినా ఉద్యోగులకు జీతాలు పెంచామని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన జగన్.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. అప్పుల భారానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు.

చంద్రబాబు ఐదేళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకెళ్లారని, రూ.39 వేల కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు. విద్యుత్ బకాయిలు రూ.21,540 కోట్లకు పెరిగాయన్నారు. అప్పులు, వడ్డీల భారం అరాచకాలను మనపై వేసిన చంద్రబాబు.. మనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.(CM Jagan Debts)

CM Jagan : సభలో గవర్నర్ ను టీడీపీ ఎమ్మెల్యేలు అవమనించారు : సీఎం జగన్

అప్పులు తీసుకునే నిబంధనను తుంగలో తొక్కి మరీ చంద్రబాబు అప్పులు చేశారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాపాలు మనల్ని వెంటాడుతున్నాయని, కేంద్రంతో పోరాడుతున్నాం అని జగన్ చెప్పారు. ”రోజుకొక జూమ్ మీటింగ్.. అరడజను ప్రెస్ మీట్లు చంద్రబాబు పెట్టిస్తాడు. రాష్ట్రానికి చంద్రబాబు, ఆయన పార్టీ చేసిన మేలు ఏంటి? దుర్మార్గం తప్ప.. అధికారం పోయి వెయ్యి రోజులైందని చంద్రబాబు రగిలిపోతున్నారు” అని జగన్ ఫైర్ అయ్యారు.(CM Jagan Debts)

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. నేటి అసెంబ్లీ సమావేశాల్లో విప‌క్ష టీడీపీ స‌భ్యుల‌పై సీఎం జగన్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యులు గవ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అవ‌మానించారని, అనుచితంగా వ్య‌వ‌హ‌రించార‌ని జగన్ మండిపడ్డారు. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు సభకు ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియట్లేదని సెటైర్లు వేశారు. (CM Jagan Debts)

Andhra Pradesh : హాట్ హాట్‌‌గా ఏపీ అసెంబ్లీ..

‘‘గవర్నర్‌ వయసుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిదీ. గవర్నర్‌ పట్ల ఇటువంటి ప్రవర్తనను గతంలో ఎప్పుడూ చూడలేదు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇలా చేయలేదు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథక‌మైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకొస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు చంద్రబాబు ఏ రోజూ విలువ ఇవ్వలేదు’’ అంటూ జగన్ మండిపడ్డారు.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని జగన్ చెప్పారు. 87 మున్సిపాలిటీలకు గానూ 84 గెలిచామన్నారు. 12 కార్పొరేషన్లనూ వైసీపీ గెలుచుకుందన్నారు. స్థానిక ఎన్నికల్లో 98.6 శాతం వైసీపీనే గెలిచిందని జగన్‌ అన్నారు. ‘‘ప్రజలు వైసీపీపై అభిమానం చూపించారు. మేం చేస్తున్న మంచిని ఆశీర్వదించారు. కరోనా కష్ట సమయంలోనూ సంక్షేమ పాలన ఆగలేదు. జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రజలు నమ్మారు. చంద్రబాబు గత పాలనకు ఛీకొడుతూ తీర్పిచ్చారు. గత ప్రభుత్వ పాలనను, మా పాలనను పోల్చి చూడాలని ప్రజలను కోరుతున్నా. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. లంచం లేకుండా చంద్రబాబు ఏ పథకాన్నైనా ఇచ్చారా? అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తున్నాం” అని జగన్ అన్నారు.