CM Jagan : సభలో గవర్నర్ ను టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారు : సీఎం జగన్
87 సంవత్సరాల పెద్దాయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్రించారు. గవర్నర్ పై దాడి చేసేంత పనిచేశారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్ధితి చూడలేదన్నారు.

Jagan
TDP MLAs insulted Governor : సభలో గవర్నర్ ను టీడీపీ ఎమ్మెల్యేలు అవమానించారని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో అసెంబ్లీకి గవర్నర్ రావడం.. ప్రభుత్వ పరిపాలనను, విధానాన్ని చెప్పడం పరిపాటిగా జరుగుతోందన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగించారు. 87 సంవత్సరాల పెద్దాయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్రించారు. గవర్నర్ పై దాడి చేసేంత పనిచేశారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్ధితి చూడలేదన్నారు.
తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించామని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు గౌరవం లేదన్నారు. చంద్రబాబు రాకుండా అతని కొడుకు, ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఒక్క సంక్షేమ పథకమైనా చెప్పుకోతగినది చేశారా..ఒక్క వెన్నుపోటు స్కీం తప్ప అని ఎద్దేవా చేశారు.
AP Assembly Budget Session: గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగం
వైసీపీ మ్యానిఫెస్టోలో 95 శాతం నెరవేర్చామని సీఎం జగన్ చెప్పారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చింపివేయడం…ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకోవడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. గతంలో కులం, మతం చూడకుండా ఒక్క సంక్షేమ పథకమేమైనా ఇచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో లంచం ఇవ్వందే పని జరిగేది కాదని విమర్శించారు. తమ నుంచి అనైతికంగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారని పేర్కొన్నారు. దేవుడు ఆ 23 నే ఎన్నికల్లో టీడీపీకి ఇచ్చారని తెలిపారు.
గ్రామాలతో పాటు జిల్లాల స్వరూపాన్ని మారుస్తున్నామని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా చేయాలని చంద్రబాబు బామ్మర్ది తమను అడుగుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో చేయకుండా కుప్పం జిల్లాను చేయాలని తమను అడుగుతున్నారంటే విజన్ ఎవరికి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మూడు ప్రాంతాలు సమానమైన డెవలప్ మెంట్ జరగాలన్నది మా తమ తపన అన్నారు.
BAC Meeting : టీడీపీ సభ్యులు గవర్నర్ వయస్సుకు కూడా గౌరవం ఇవ్వలేదు-సీఎం జగన్
చంద్రబాబు ఎప్పుడు ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలని చూశారని వెల్లడించారు. రాజధాని, రాజధానిలో పేదలకు ఇళ్లిచ్చినా కోర్టుల్లో కేసులు వారే వేయిస్తారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే ప్రజలు నష్టపోతున్నారని చంద్రబాబు గ్రహించకపోగా.. సంతోషిస్తాడని పేర్కొన్నారు. చంద్రబాబు.. నారాయణ, చైతన్య కోసం పనిచేస్తే తమ ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్ల డెవలప్ మెంట్ కోసం పనిచేస్తుందని చెప్పారు.