AP Pensioners : న్యూ ఇయర్ గిఫ్ట్…జనవరి 01వ తేదీ నుంచి రూ. 2500 పెన్షన్

ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన అర్హులకు 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం ఆయన నగదు జమ చేశారు.

AP Pensioners : న్యూ ఇయర్ గిఫ్ట్…జనవరి 01వ తేదీ నుంచి రూ. 2500 పెన్షన్

Cm Jagan

CM Jagan Good News For Pensioners : అర్హత ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోలేని వారికి లబ్ధి చేకూర్చారు ఏపీ సీఎం జగన్‌. వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. అర్హులైన 9 లక్షల 31 వేల మంది లబ్ధిదారులకు… ఏడు వందల రెండు కోట్ల 63 లక్షల రూపాయల నగదు జమ చేశారు. కొన్ని నెలలుగా పెన్షన్లు, రేషన్‌ బియ్యం, ఆరోగ్య శ్రీ అందుకోలేకపోయిన అర్హులకు ఈ మొత్తం అందుతోంది. అర్హులైన ఇళ్ల లబ్ధిదారులకు సైతం 90 రోజుల్లో పట్టాలు అందించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన అర్హులకు 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం ఆయన నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…

Read More : Mithani Flyover : మిథాని ఫ్లై ఓవర్‌కు మాజీ రాష్ట్రపతి పేరు

తమ ప్రభుత్వం విప్లవాత్మకంగా వెళుతోందని, కలం, మతం, పార్టీ చూడకుండా అందరికీ పథకాలు అందుతున్నాయన్నారు. గతంలో ఎలా కత్తిరించాలా ? అని ప్రభుత్వాలు చూసేవని, టీడీపీ హయాంలో 39 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చారని గుర్తు చేశారాయన. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…61 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతోందన్నారు. రాబోయే ఒకటో తేదీ నుంచి పెన్షన్ రూ. 2500 జమ అవుతుందని ప్రకటించారు. ఏ ఒక్కరూ పథకాలు మిస్ కాకూడదని, ఏ ఒక్కరికీ అన్యాయం జరుగొద్దనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం విప్లవాత్మకంగా ముందుకెళుతోందన్నారు.

Read More : BJP MP : రూ.15 లక్షలలోపు అవినీతి చేసివాళ్లను వదిలేయండి…అంతకంటే ఎక్కువైతే నాకు చెప్పండి : బీజేపీ ఎంపీ

అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందుకోలేనివారిని గుర్తించి ఇకపై జూన్‌లో ఒకసారి, డిసెంబర్‌లో ఒకసారి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు సీఎం జగన్‌. సచివాలయాల్లో లిస్టులు తయారుచేసి ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామన్నారు. మొత్తం 9 లక్షల 30 వేల 809 మంది లబ్ధిదారుల అకౌంట్లలో 703 కోట్లు జమ చేయనున్నారు. ఇంతే కాకుండా పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, 90 రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించనున్నారు. అర్హులై ఉండి లబ్ధిపొందని వారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి.. ఏటా జూన్‌, డిసెంబర్‌లో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.