Mithani Flyover : మిధాని ఫ్లై ఓవర్‌కు మాజీ రాష్ట్రపతి పేరు

రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన మిథాని - ఒవైసి ఫ్లై ఓవర్‌ను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ ఓపెన్ కావడంతో కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పాయి.

Mithani Flyover : మిధాని ఫ్లై ఓవర్‌కు మాజీ రాష్ట్రపతి పేరు

Mithani Flyover

Mithani Flyover : హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ ప్రారంభమైంది. మిధాని జంక్షన్ నుంచి ఒవైసీ సర్కిల్ వరకు రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 1.36 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్‌.. వన్ వే రోడ్డుగా 3 లేన్ల(lane)తో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది.

చదవండి : Hyderabad: ఒవైసీ ఫ్లైఓవర్‌.. హైదరాబాద్ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

2018 ఏప్రిల్‌లో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం కాగా.. డిసెంబర్ 28, 2021న ప్రారంభమైంది. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఆరాంఘర్‌, చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరామల్ గూడ, కర్మన్‌ ఘాట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. ఈ ఫ్లై ఓవర్‌కి భార‌త మాజీ రాష్ట్రప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం పేరు పెట్టింది ప్రభుత్వం.

చదవండి : Pubs in Hyderabad: శాపంగా మారిన పబ్‌లు.. నిద్రపోనివ్వట్లేదు