CM Jagan : ఎక్కడా కరెంటు కోతలు ఉండొద్దు, సీఎం జగన్ ఆదేశం

దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు చీకట్లో మగ్గిపోవాల్సిందేనని భయపడుతున్నారు. విద్యుత్‌ సంక్షోభ

CM Jagan : ఎక్కడా కరెంటు కోతలు ఉండొద్దు, సీఎం జగన్ ఆదేశం

Cm Jagan

CM Jagan : దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు చీకట్లో మగ్గిపోవాల్సిందేనని భయపడుతున్నారు. విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు కరెంట్‌ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. ఇక ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం భయాలు లేకపోలేదు. కరెంటు కోతలు తప్పకపోవచ్చనే సూచనలు అందుతున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితులపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై సీఎం ఆరా తీశారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి కెపాసిటీతో నడిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన బొగ్గు కొనుగోలు చేయాలన్న సీఎం..అందుకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలని సూచించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలన్నారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఎక్కడా విద్యుత్‌ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తేల్చి చెప్పారు.

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

దేశవ్యాప్తంగా బొగ్గు కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆందోళనలు నెలకొన్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఇక ఏపీలోనూ ఆందోళన నెలకొని ఉంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్ వినియోగదారులు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీలు వాడొద్దని అధికారులు ఇటీవల సూచించారు. విద్యుత్ సరఫరాకి, డిమాండ్‌కి వైరుధ్యం ఉందని, పీక్ లోడింగ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని, కాబట్టి కరెంటును జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారం తప్పదని కూడా హెచ్చరించారు.

రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్యకు జగన్ ప్రభుత్వ అసమర్ధతే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు బొగ్గు కొరత తీవ్రంగా ఉందని ఇప్పటికే సీఎం జగన్ నేరుగా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మాత్రం బొగ్గు కొరత తీర్చే ప్రయత్నంలో ఉన్నామని, ఆందోళన అవసరం లేదని చెబుతోంది.