CM Jagan : జగన్ ఢిల్లీ టూర్.. 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని వినతి

విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్యసదుపాయాల కొరత ఏర్పడిందని సీఎం జగన్ వివరించారు. ఇందుకోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

CM Jagan : జగన్ ఢిల్లీ టూర్.. 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని వినతి

Cm Jagan (4)

CM Jagan : ఏపీలో 13 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి మాండవీయను సీఎం జగన్ కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయాను జగన్ కలిశారు. దాదాపు అరగంటపాటు సాగిన భేటీలో పలు విజ్ఞప్తులు అందజేశారు. రాష్ట్రంలో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటు చేసినందున ప్రతి జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్యసదుపాయాల కొరత ఏర్పడిందని సీఎం జగన్ వివరించారు. ఇందుకోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

CM Jagan Slams Chandrababu : నాకు, చంద్రబాబుకి అదే తేడా-సీఎం జగన్ హాట్ కామెంట్స్

పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రస్తుతం ఉన్న బోధనాసుపత్రులను, నర్సింగ్‌ కాలేజీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలకు ఒక వైద్యకళాశాల ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇదివరకే 11 మెడికల్‌ కాలేజీలు ఉండగా పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్తగా మెడికల్‌ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.

అయితే కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని మిగిలిన 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. 2023 డిసెంబర్‌ నాటికి ఈ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేస్తామని… 2024 అడ్మిషన్లకు సిద్ధం చేస్తామని సీఎం జగన్ తెలిపారు.