Clean AP : సీఎం జగన్ కీలక ఆదేశాలు

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు

Clean AP : సీఎం జగన్ కీలక ఆదేశాలు

Clean Ap

Clean AP : క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు సూచించారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను త్వరగా తెప్పించుకోవాలని సూచించారు. గ్రామాల్లో డస్ట్ బిన్స్ లేని వాళ్లకు డస్ట్ బిన్స్ ఇవ్వాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా తాగునీటి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు.

‘కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలి. గ్రేడ్‌- 2,3, నగర పంచాయతీలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ కూడా ఆయా నగరాలకు, పట్టణాలకు, నగర పంచాయతీలకు, పంచాయతీలకు చేరవేయాలి. నగరాలు, పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించడమే కాకుండా దుర్వాసన ఆ ప్రాంతంలో రాకుండా చర్యలు తీసుకోవాలని’ సీఎం జగన్ ఆదేశించారు.

Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే?

గుంటూరు వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారం సిద్ధమైందని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించగా… ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్లపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు.

”పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలి. పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడంపైనే కాదు, వాటిని పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక దృష్టి పెట్టాలి. విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలి. గ్రామంలో పారిశుద్ధ్యంపైనా నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి” అని సీఎం జగన్ అధికారులతో చెప్పారు.

Weight Loss : ప్రసవం తరువాత బరువు తగ్గటం ఎలా?

అలాగే వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నివాస ప్రాంతాల్లో మురుగునీటి నిల్వ లేకుండా చేయాలన్నీ సీఎం జగన్ దీన్నొక సవాల్‌గా తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.