CM Jagan : సీతారాముల కళ్యాణానికి సీఎం జగన్ దంపతులు.. 5వేల మందికే అవకాశం

కడప జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈసారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. రాములోరి కల్యాణానికి కేవలం 5వేల మంది భక్తులకు మాత్రమే పాసుల ద్వారా అవకాశం కల్పిస్తామన్నారు.

CM Jagan : సీతారాముల కళ్యాణానికి సీఎం జగన్ దంపతులు.. 5వేల మందికే అవకాశం

Cm Jagan Vontimitta

CM Jagan Vontimitta : కడప జిల్లాలోని ప్రఖ్యాత ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణాన్ని ఈసారి పూర్తిగా కోవిడ్ నిబంధనలతో నిర్వహిస్తామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. రాములోరి కల్యాణానికి కేవలం 5వేల మంది భక్తులకు మాత్రమే పాసుల ద్వారా అవకాశం కల్పిస్తామన్నారు. కాగా, స్వామివారి కల్యాణానికి సీఎం జగన్‌ దంపతులు హాజరవుతారని ఆయన తెలిపారు. స్వామివారికి సీఎం జగన్‌ దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.

5వేల మందికే అవకాశం :
ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోదండ రాముడి కల్యాణం నిర్వహించనున్నట్లు జవహర్‌ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం (ఏప్రిల్ 9,2021) ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు కల్యాణ వేదిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 5 వేల మందికి కల్యాణోత్సవ పాసులు జారీ చేస్తామన్నారు.