CM Jagan : కరోనాతో అనాథలైన పిల్లలను ఆదుకుంటాం, సీఎం జగన్ గొప్ప మనసు

కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వారికి ఆర్థికసాయం అందించడంపై కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు.

CM Jagan : కరోనాతో అనాథలైన పిల్లలను ఆదుకుంటాం, సీఎం జగన్ గొప్ప మనసు

Cm Jagan

CM Jagan : కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. వారికి ఆర్థికసాయం అందించడంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు.

ఇక ఏపీలో ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనాను అదుపు చేసేందుకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.

రాష్ట్రంలో పదివేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని చెప్పారు. ఈ నెలాఖరు కల్లా 2వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ రాబోతున్నాయని తెలిపారు. అంతేకాదు బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించారన్నారు. పాజిటివ్ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని, బ్లాక్ ఫంగస్ నివారణకు వాడే మందులను సమకూర్చాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.

ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష అనంతరం కర్ఫ్యూ పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క‌ర్ఫ్యూ విధించి 10 రోజులే అయింద‌న్న సీఎం.. క‌ర్ఫ్యూ 4 వారాలు ఉంటేనే స‌రైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని అన్నారు.