ఎన్నికల ఫలితాలు మెరుగ్గా లేకపోతే పదవులు ఊడతాయ్ : మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్

స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు సీఎం జగన్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు.

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 01:51 PM IST
ఎన్నికల ఫలితాలు మెరుగ్గా లేకపోతే పదవులు ఊడతాయ్ : మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్

స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు సీఎం జగన్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు.

స్థానిక సంస్థలను పూర్తిస్థాయిలో చేజిక్కించుకోవడానికి సీఎం జగన్ వ్యూహం పన్నారు. స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు జగన్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతను మంత్రులకు అప్పగించారు. ఇప్పటికే మంత్రులకు టార్గెట్లు ఫిక్స్ చేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులకే ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల్లో ఫలితాలు మెరుగ్గా లేకపోతే పదవులు ఊడతాయని హెచ్చరించారు.

పనితీరు బాగాలేకపోతే.. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వం
పనితీరు బాగాలేకపోతే పదవి పోతుందని మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే స్థాయిలో పనితీరు బాగాలేకపోతే.. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని చెప్పారు. అధికార పార్టీ నేతలను ఈ రేంజ్ లో ప్రిపేర్ చేసిన జగన్.. ప్రతిపక్షానికి మాత్రం ఊహించని జలక్ ఇచ్చారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేస్తే మూడేళ్ల జైలు శిక్షతోపాటు అనర్హత వేటు వేస్తామని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 

డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలిస్తే పదవుల తొలగింపు
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్ పీ, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలిస్తే పదవులను తొలగించేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలతో ప్రభుత్వం ప్రతిపక్షంలో గుబులు పుట్టించింది. 

నేతలను సమన్వయం చేసే బాధ్యతలు సుజ్జల, వైవీ సుబ్బారెడ్డికి అప్పగింత
నేతలను సమన్వయం చేసే బాధ్యతలు సుజ్జల, వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కలియదిరుగుతూ పర్యటిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే రెండు రోజుల్లో విస్తృతస్థాయి సమావేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ నేతల్లో ధీమా వ్యక్తం అవుతోంది.