Cold Waves : మరో 3 రోజులు శీతల గాలులు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈ చలిగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తె

Cold Waves : మరో 3 రోజులు శీతల గాలులు

Cold Waves

Cold Waves :  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈ చలిగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో ఈశాన్య దిశనుండి ..కిందిస్ధాయిగా శీతలగాలులు వీస్తున్నాయని అధికారులు వివరించారు. రాగల మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2నుండి 4 సెల్సియస్ తగ్గే వరుక అవకాశం ఉందని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరిలో మంగళవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బేల, సిర్పూర్ (యు)లో 3.8 డిగ్రీల సెల్సియస్‌, అర్లి (టి)లో 3.9 డిగ్రీల సెల్సియస్‌, జైనథ్‌లోని వాంకిడిలో 4.9 డిగ్రీల సెల్సియస్‌, 5.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చాప్రా, సోనాలలో 5.2 డిగ్రీల సెల్సియస్, బజార్ హత్నూర్‌లో 5.3, లోకిరిలో 5.4,డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది.

Also Read :Cheating Wife : పెళ్లైన రెండు రోజులకే భర్తను మోసం చేసి పరారైన కొత్త పెళ్ళికూతురు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ఏరియాలో కూడా ఉష్ణోగ్రతలు తగ్గాయి. తెలంగాణ లోని ఆదిలాబాద్, ఏపీలోని విశాఖ. తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాలో సాయంత్రం వేళకే శీతలగాలులతో మంచు తెరలు కమ్నుకుంటున్నాయి. మంచు కారణంగా రాత్రిపూట వాహానదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. చలి తీవ్రత పెరగటంతో చిన్నారులు వృధ్దులు, గర్భిణీలు, శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  మంగళవారం ఉదయం  విశాఖ జిల్లా  పాడేరు లో 10డిగ్రీలు, మినుములురు 08 డిగ్రీలు, చింతపల్లి 9.8 డిగ్రీలు, అరకులోయలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది.