Rains In Andhra Pradesh : 29వ తేదీ వరకు ఆ రెండు జిల్లాల్లో వర్షాలు

ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు

Rains In Andhra Pradesh : 29వ తేదీ వరకు ఆ రెండు జిల్లాల్లో వర్షాలు

Rains In Andhra Pradesh

Rains In Andhra Pradesh : ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొరిమన్, శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రెండు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఈ నెల 29వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

చదవండి : Heavy Rains : తమిళనాడులో గ్యాప్ లేకుండా దంచికొడుతున్న వానలు

ఇక భారీ వర్షాల దాటికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చివురుటాకులా ఒణికిపోతుంటే, మరో అల్పపీడనం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇక దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం (29-11-2021) ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనంగా మారె అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

చదవండి : Heavy Rains Effect : భారీ వర్షాలకు భూమిలోకి కుంగిన మూడంతస్తుల భవనం

ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో తీరప్రాంతంలో 30-40 కిలోమోటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.