Heavy Rains Effect : భారీ వర్షాలకు భూమిలోకి కుంగిన మూడంతస్తుల భవనం
చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్ లో మూడంతస్తుల భవనం భూమిలోకి కుంగింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు ఆందోళన చెందుతున్నారు.

New Project
Heavy Rains Effect : చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్ లో మూడంతస్తుల భవనం భూమిలోకి కుంగింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు ఆందోళన చెందుతున్నారు.
భవనం భూమిలోకి కుంగిపోవటంతో పలుచోట్ల బీటలు వారింది. ఫ్లోరింగ్ పగిలి పోయింది. ఇంట్లో వేసిన టైల్స్ పగిలిపోయాయి. బిల్డింగ్ ఒక పక్క భూమిలోకి కుంగే సరికి భూగర్భంలో నిర్నించిన సంప్ బయటకు వచ్చింది. చుట్టుపక్కల మరో 18 ఇళ్లల్లో కూడా గోడలకు పగుళ్లు, బీటలు, వారటంతో స్ధానికులు ఆందోళన చెందుతున్నారు.