Cyclone Jawad : విజయనగరంలో రెండు రోజులు పాఠశాలలకు సెలవు, విశాఖకు పర్యాటకులు రావొద్దు

జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.

Cyclone Jawad : విజయనగరంలో రెండు రోజులు పాఠశాలలకు సెలవు, విశాఖకు పర్యాటకులు రావొద్దు

Cyclone Jawad

Cyclone Jawad : ఇప్పటికే కురిసిన వర్షాలతో తల్లాడిన ఏపీకి మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం తుపాన్ మారి…ఆంధ్రా..ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాన్ కు జొవాద్ పేరు పెట్టారు. ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో…ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు. పలు చర్యలు తీసుకుంటున్నారు. తుపాన్ కారణంగా..భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో..విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జొవాద్ తుపాన్ దృష్ట్యా 2021, డిసెంబర్ 03వ తేదీ శుక్రవారం, డిసెంబర్ 04వ తేదీ శనివారం జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.

Read More : Covid-19 : ఏపీలో కరోనా ఎన్ని కేసులంటే..?

మరోవైపు..తుపాన్ పట్ల విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ డా.మల్లిఖార్జున పర్యటించారు. గతంలో గులాబ్ తుపాన్ సమయంలో మునిగిన..ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాకు ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయన్నారు. 4, 5, 6 తేదీల్లో విశాఖకు పర్యాటకులు రావొద్దని, తుపాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం ప్రారంభమై.. అదికాస్తా తుపానుగా మారి 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో తీరందాటే అవకాశం కనిపిస్తోంది.

Read More : Cyclone : ఏపీకి తుపాను గండం

ఇదిలా ఉంటే… తుపాన్‌ పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్‌ చర్చించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని, తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. తుపాన్ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళంకు హెచ్‌.అరుణ్‌కుమార్, విజయనగరంకు కాంతిలాల్‌దండే, విశాఖకు శ్యామలరావును నియమించారు. జొవాద్ తుపాను ఎఫెక్ట్ పై తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటింది. నేటి నుంచి మూడు రోజులపాటు 95 రైళ్లను రద్దు చేసింది.