Cyclone : ఏపీకి తుపాను గండం

ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అతాలకుతలమైన రాష్ట్రానికి తుపాను గండం గడగడలాడిస్తోంది. అండమాన్‌లో పుట్టిన అల్పపీడనం తుపానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone : ఏపీకి తుపాను గండం

Cyclone

Cyclone threat to AP : ఆంధ్రప్రదేశ్‌కి మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అతాలకుతలమైన రాష్ట్రానికి తుపాను గండం గడగడలాడిస్తోంది. అండమాన్‌లో పుట్టిన అల్పపీడనం తుపానుగా మారి ఆంధ్రా, ఒడిశా తీరంలో తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్లుండి తీరం దాటే అవకాశముందని, ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. జొవాద్‌ రూపంలో ముప్పు ఉత్తరాంధ్రను ముంచెత్తబోతోంది.

సైక్లోన్ ప్రభావంతో.. ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలు వణికిపోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావారణ శాఖ హెచ్చరించింది. మొన్నటి వరకూ వర్షాలు కురుస్తుండటంతో కోతలు సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్న సమయంలో మళ్లీ తుపాను హెచ్చరికలు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

దేశ వ్యాప్తంగా పశ్చిమవాయువ్యంగా జొవాద్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అలర్ట్ చేసింది. నేటి నుంచే దాని ప్రభావం ఉండే అవకాశముంది. అటు మహారాష్ట్ర, గుజరాత్‌లతో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. 40కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం ప్రారంభమై.. అదికాస్తా తుపానుగా మారి 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో తీరందాటే అవకాశం కనిపిస్తోంది.