Dentons : డెంటన్స్‌‌లో విశాఖ మహిళకు కీలక పదవి

ప్రపంచంలో అతిపెద్ద ‘లా’ సంస్థగా ‘డెంటన్స్’ గుర్తింపు పొందింది. ఇందులో మానవ వనరుల విభాగానికి అధిపతిగా...ఓ మహిళ నియమతులు కావడం విశేషం.

Dentons : డెంటన్స్‌‌లో విశాఖ మహిళకు కీలక పదవి

Dentons

Dentons Appoints Neelima Paladugu : ప్రపంచంలో అతిపెద్ద ‘లా’ సంస్థగా ‘డెంటన్స్’ గుర్తింపు పొందింది. ఇందులో మానవ వనరుల విభాగానికి అధిపతిగా…ఓ మహిళ నియమతులు కావడం విశేషం. అది కూడా..ఈమె తెలుగు మహిళ కావడం విశేషం. ఒక భారతీయురాలికి ఈ తరహా..కంపెనీలో గ్లోబల్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా పదవి దక్కడం ఇదే తొలిసారి అని అంటున్నారు.

Read More : Heavy rains in Telangana: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో ఉప్పలపాటి సాయిరాణి..రాజా దంపతులకు నీలిమ జన్మించారు. నీలిమ పాలడుగు..అమెరికాలోని డెల్లాయిట్ కంపెనీలో ‘గ్లోబల్ పీపుల్స్ మేనేజింగ్ డైరెక్టర్’ గా పని చేస్తున్నారు. సుధాకర్ పాలడుగుతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె రియా, కొడుకు సునీల్ ఉన్నారు. విశాఖలోని కొటక్ పాఠశాలలో పదో తరగతి, సెయింట్ జోసఫ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ నీలిమ పూర్తి చేశారు. మెరిల్ లించ్, పీడబ్ల్యూసీ, ఐబీఎం వంటి కంపెనీలలో మానవ విభాగంలో పని చేసి అనుభవం సంపాదించారు.

Read More : Telangana new secretariat: జోరుగా తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులు

తాజాగా..డెంటన్స్ లో మానవ వనరుల విభాగానికి అధిపతిగా నీలిమ నియమితులయ్యారు. 250కి పైగా దేశావలలో డెంటన్స్ విస్తరించి ఉంది. నవంబర్ 15వ తేదీన ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందులో దాదాపు 20 వేల మందికిపైగా…ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 12 వేల మంది వరకు న్యాయవాదులు ఉంటారు. నీలిమ రాకతో తమ వాణిజ్య కార్యకలాపాల్లో మానవ వనరుల నిర్వహణ వ్యూహాలు మరింత పటిష్టంగా అమలవుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు డెంటన్స్ గ్లోబల్ సీఈవో ఎల్లైట్ పోర్టోని.