Dowry Harassment : సార్‌.. ఎవ్వరినీ వదలొద్దు.. కంటతడి పెట్టిస్తున్న నవ వధువు సూసైడ్ నోట్

వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైంది. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. కడప నగరం నెహ్రూనగర్‌లో ఈ వ

Dowry Harassment : సార్‌.. ఎవ్వరినీ వదలొద్దు.. కంటతడి పెట్టిస్తున్న నవ వధువు సూసైడ్ నోట్

Dowry Harassment

Updated On : September 15, 2021 / 11:33 PM IST

Dowry Harassment : వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైంది. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. కడప నగరం నెహ్రూనగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

కడపకు చెందిన ఝాన్సీ(26)కి, రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణతో గత నెల 15న వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.15లక్షలు ఇచ్చారు. అయితే, పెళ్లైన 2వరోజు నుంచే అధిక కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. రూ. 70 లక్షలు ఇస్తేనే సంసారానికి రావాలంటూ ఈ నెల 2న అత్తా, మామలు ఝాన్సీని పుట్టింట్లో వదిలేశారు.

పెద్దమనుషులు రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పంచాయితీ చేశారు. తనకు రూ.70 లక్షలు ఇస్తేనే తన భార్యను సంసారానికి తీసుకెళతానని అతడు తేల్చి చెప్పాడు. కాగా, దీన్ని తన కుటుంబ సభ్యులకు అవమానంగా భావించిన ఝాన్సీ తీవ్ర నిర్ణయం తీసుకుంది. సూసైడ్‌ నోట్‌ రాసింది. ఇంట్లో ఎవరూ గమనించని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి, తమ్ముడు గమనించే సరికి ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

కరోనా మన జీవితాల్లో భాగంగా ఉండిపోతుందా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులకు ఇదే నిదర్శనమా?

ఝాన్సీ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. ”డియర్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌..ఎవ్వరినీ వదిలిపెట్టొ్టద్దు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు.. వాళ్లు చాలా క్రిమినల్‌ మైండెండ్.. మా తల్లిని, కుటుంబాన్ని రక్షించండి.. పవన్‌ ( తమ్ముడు) నువ్వు ఏడవద్దు.. మా తల్లికి, తమ్ముడికి భవిష్యత్తులో ఆపద వస్తే అది రాధాకృష్ణ వల్లనే…” అని సూసైడ్‌ నోట్‌లో రాసుంది. వరకట్న చావు కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.