Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మాస్కుల వినియోగం తప్పనిసరని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మాస్కుల వినియోగం మస్ట్ చేశాయి ప్రభుత్వాయి. కరోనా వ్యాప

Surgical Masks : సర్జికల్‌ మాస్కులే మంచివి, కరోనా వ్యాప్తికి చెక్

Surgical Masks

Surgical Masks : కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మాస్కుల వినియోగం తప్పనిసరని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మాస్కుల వినియోగం మస్ట్ చేశాయి ప్రభుత్వాయి. కరోనా వ్యాప్తి జరుగకుండా ఉండాలంటే మాస్కులు ధరించాల్సిందే. అయితే, ఏది వాడాలి? ఏవి మంచివి? దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి? ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగులుతున్నాయి.

WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

కాగా, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ సర్వేలో కీలక విషయాలు వెలుగుచూశాయి. మామూలు మాస్క్‌ల కన్నా సర్జికల్‌ మాస్కులే మంచివని, వీటి వాడకంతోనే వ్యాప్తి తగ్గిపోతుందని తేలింది. మాస్కుల పాత్రపై నిరంతరం తలెత్తే ప్రశ్నలకు సమాధానమివ్వడంతోపాటు కరోనాపై పోరాటంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉందని పరిశోధన వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని 600 మారుమూల గ్రామాల్లోని దాదాపు 3,50,000 మందిని పరిశోధనకు ఎంచుకున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన విషయాలు ఇన్నోవేషన్‌ ఫర్‌ పావర్టీ యాక్షన్‌ అనే పత్రికలో ప్రచురితమైంది.

Facebook : స్మార్ట్ గ్లాసెస్‌‌తో వీడియో, ఫొటోలు క్లిక్..రికార్డు చేయొచ్చు!

మూడు లేయర్ల పాలిప్రొపలీన్‌తో తయారైన మాస్క్‌ల వాడకం వల్ల 95 శాతం ప్రయోజనాలు కనిపించాయని పరిశోధనలో తెలిసింది. అలాగే, వృద్ధుల్లో వీటి వల్ల ఎక్కువ ఉపయోగం కనిపించింది. 60 ఏళ్లకు పైబడిన వారిలో 35 శాతం ఫలితం వచ్చింది. సర్జికల్‌ మాస్క్‌లు సాధారణ వస్త్రంతో చేసిన వాటి కన్నా ధరలో తక్కువ. అదే విధంగా వేడి, తేమ వాతావరణంలో సర్జికల్‌ మాస్క్‌లను వాడటం చాలా సులువు. వస్త్రంతో చేసినవి ఉతగ్గానే దాని టెంపర్‌ను కోల్పోయి వేలాడేసినట్లుగా తయారవుతున్నాయి. పరిశోధన జరుపుతున్న సమయంలోనే ఇంటింటికి వెళ్లి మరీ సర్జికల్‌ మాస్క్‌లను పరిశోధకులు పంపిణీ చేశారు.

వీడియోలు, బ్రోచర్ల ద్వారా మాస్క్‌లు ధరించాలని ప్రజలను విద్యావంతులను చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ జనం గుమిగూడే ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని పరిశోధకులు ప్రజలకు సూచించారు. వీరి చొరవ కారణంగా కరోనా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 9.3 శాతం తగ్గినట్లు కూడా వారు గుర్తించారు.

దేశంలో కొత్తగా 27వేల 176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది. ఇందులో 3,51,087 యాక్టివ్‌ కేసులున్నాయి. 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,43,497 మంది కరోనాతో చనిపోయారు. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 38,012 మంది కోలుకోగా, 284 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 61,15,690 మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది. దీంతో మొత్తం 75,89,12,277 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

దేశవ్యాప్తంగా మంగళవారం వరకు 54,60,55,796 నమూనాలకు పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 16,10,829 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.