Telugu States : తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్..తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు

తెలుగు రాష్ట్రాల్లో తాగుబోతులు తమ ర్యాష్‌ డ్రైవింగ్‌తో బీభత్సం సృష్టిస్తున్నారు.. ఫుల్‌గా మద్యం సేవించి ఓవర్‌ స్పీడ్‌తో నడుపుతూ...

Telugu States : తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్..తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు

Drunk And Drive

Drunk Man’s Rash Driving : తాగి బండి నడపవద్దు..వారి ప్రాణాలే తీయడమే కాకుండా..ఇతర ప్రాణాలను తీస్తున్నారు మందుబాబులు. పీకలదాక మద్యం సేవించి..వాహనాలను రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు వీకెండ్ వేళ, హఠాత్తుగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎన్ని చేస్తున్నా మందుబాబుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా..తెలుగు రాష్ట్రాల్లో యాక్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. ఫలితంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Read More : Tablighi Jamaat : తబ్లిగీ జమాత్ పై సౌదీ అరేబియా నిషేధం

తెలుగు రాష్ట్రాల్లో తాగుబోతులు తమ ర్యాష్‌ డ్రైవింగ్‌తో బీభత్సం సృష్టిస్తున్నారు.. ఫుల్‌గా మద్యం సేవించి ఓవర్‌ స్పీడ్‌తో నడుపుతూ వారి ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వారి ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు చేసిన వీరంగంతో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు.. హైదరాబాద్‌, మేడ్చల్, విశాఖ జిల్లాల్లో ప్రమాదాలు జరిగాయి.. మేడ్చల్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టాడు.. విద్యానగర్‌ ఫ్లై ఓవర్‌పై ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది.. ఇక విశాఖ ఆర్కే బీచ్‌లో మద్యం సేవించి కారు నడుపుతూ వాకర్స్‌పైకి దూసుకెళ్లాడు మరో ప్రబుద్ధుడు.. వెంటనే అక్కడున్న పోలీసులు అలర్టై బారికేడ్లను అడ్డుగా పెట్టడంతో కారు నిలిచిపోయింది.