తంటికొండ ప్రమాదం : నలుగురు పరిస్థితి విషమం, ఏడుగురు మృతి

  • Published By: madhu ,Published On : October 30, 2020 / 10:17 AM IST
తంటికొండ ప్రమాదం : నలుగురు పరిస్థితి విషమం, ఏడుగురు మృతి

East Godavari Tantikonda Accident : తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. స్పాట్‌లోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. గాయపడిన 10 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం రాత్రి వివాహం జరిగింది.



అర్థరాత్రి 2గంటల తరువాత పెళ్లి బృందం సభ్యులు టాటా ఏస్‌ ఆటోలో ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. డ్రైవర్ ఆటోను కొండ దిగువ వైపునకు పార్క్ చేసి పెట్టాడు. ఆటోలో 30మంది వరకు ఎక్కారు. డ్రైవర్ ఆటో స్టార్ట్ చేసిన తరువాత.. వెనుక ఉన్న వారు తమ లగేజ్ పైన పెట్టమని కోరారు. డ్రైవర్ అనాలోచితంగా.. ఆటో పైకి ఎక్కడంతో.. వాహనం డౌన్‌లోకి కదిలింది. భయపడిపోయిన ఆటో డ్రైవర్ పై నుంచి కిందికి దూకేశాడు.



ఆటో ఘాట్‌రోడ్డును ఢీకొట్టుకుంటూ పక్కనే ఉన్న మెట్లపై పల్టీలు కొట్టింది. ఆటోలో వెనుక కూర్చున్న వారంతా చెల్లాచెదురుగా పడ్డారు. మెట్లకు తలలు తగిలి స్పాట్‌లోనే ఐదుగురు చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయాలైన పది మందిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.



ఘటనా స్థలాన్ని జిల్లా అర్బన్‌ ఎస్పీ షిమోషి బాజ్‌పాయ్‌, సీఐ పవర్‌ కుమార్‌ సందర్శించారు. ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

మృతులు : కంటాల భాను, సింహాద్రి ప్రసాద్, ఎల్లా శ్రీలక్ష్మి, ఎల్లా శ్రీదివ్య, చాగంటి యామిని, నరసింహారావు.



డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మృతులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొండ దిగే సమయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన డ్రైవర్‌.. టాటా ఏస్‌ ఆటో ఆన్‌చేసి వెనక్కి వెళ్లాడని… అదే ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. ఆటో పల్టీ కొట్టడంతో… డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడని చెబుతున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.