ఏలూరు అంతుచిక్కని వ్యాధి : నేడు ఢిల్లీ ఎయిమ్స్‌ ఫైనల్‌ రిపోర్ట్‌లు

ఏలూరు అంతుచిక్కని వ్యాధి : నేడు ఢిల్లీ ఎయిమ్స్‌ ఫైనల్‌ రిపోర్ట్‌లు

Eluru’s mysterious illness : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోన్న అంతుచిక్కని వ్యాధి గుట్టు నేడు తేలిపోనుంది. వివిధ రకాల శాంపిల్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్‌ రిపోర్ట్స్‌ ఇవాళ రానున్నాయి. దీంతో ఈ వ్యాధికి కారణాలేంటన్న అంశాలు తేలిపోనున్నాయి. ఈ నెల 5న ఏలూరులో వింత వ్యాధి సోకడంతో… వందల సంఖ్యలో జనాలు ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల్లోనే ఆ సంఖ్య 600 దాటింది. ఫిట్స్‌ రావడంతోపాటు… స్పృహ కోల్పోవడం, వాంతులు, కడుపులో నొప్పి, నరాలు లాగడం, నురక కక్కడంలాంటి లక్షణాలతో జనాలు ఆస్పత్రుల్లో చేరారు.

ఈ లక్షణాలు ఏ వ్యాధి లక్షణాలు తెలియకపోవడంతో… అధికారులకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలో అర్థం కాలేదు. దీంతో తొలి రెండు రోజులు పరిస్థితి అంతా గందగరోళంగా మారింది. ఒకవైపు బాధితులు పెరుగుతుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. దీంతో రంగంలోకి వైద్య బృందాలు దిగాయి. బాధితుల నుంచి శాంపిల్స్‌ సేకరించాయి.

అంతుచిక్కని వ్యాధి మరింతగా విజృంభించడంతో… రాష్ట్రప్రభుత్వ సంస్థలు, జాతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించాయి. వాటర్‌ సమస్యేనని పుకార్లు రావడంతో నీటి నమూనాలు సేకరించారు. వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు, పుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌, ఎన్‌ఐఎన్‌, మంగళగిరి ఎయిమ్స్‌, ఢిల్లీ ఎయిమ్స్‌, ఎన్‌సీడీసీలాంటి జాతీయ స్థాయి సంస్థల బృందాలు ఏలూరు నగరంలో శాంపిల్స్‌ సేకరించాయి. వాటర్‌, ఆహార పదార్థాలతోపాటు…. కల్చర్‌, రోగుల బ్లడ్‌ శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాయి.

కొన్ని పరీక్షల ఫలితాలు ఇప్పటికే రాగా.. మరికొన్ని టెస్ట్‌లు రాలేదు. బాధితుల బ్లడ్‌ శాంపిల్స్‌ , వాటర్‌ నమూనాల రిజల్ట్స్‌ ఇప్పటికే వచ్చాయి. తాగునీటిలో లెడ్‌, నికెల్‌ అధిక మోతాదులో ఉన్నట్టు తేలింది. బియ్యం పప్పుల్లో మెర్క్యూరీ శాతంగా ఎక్కువగా ఉన్నట్టు రిపోర్ట్‌ల్లో బయటపడింది. ఇక కూరగాయల్లోనూ ఫెస్టిసైడ్స్‌ మోతాకుదుకు మించి ఉన్నట్టుగా టెస్ట్‌లు తేల్చాయి. ప్రాథమికంగా ఈ రిపోర్టులు వచ్చినా.. ఫైనల్‌ ఫలితాలు మాత్రం ఇవాళ రానున్నాయి.

ఏలూరును పట్టిపీడిస్తోన్న అంతు చిక్కని వ్యాధి ఏంటో ఇప్పటి వరకు మిస్టరీగానే ఉండిపోయింది. ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి ఫైనల్‌ రిపోర్ట్‌లు రానున్నాయి. దీంతో ఈ వ్యాధి మిస్టరీ వీడే అవకాశముంది. ఫైనల్‌ రిపోర్ట్‌ల కోసం స్థానిక ప్రజలతోపాటు.. ప్రభుత్వం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.