Kodali Nani Comments: టీడీపీ, జనసేన, బీజేపీని మూటగట్టి బంగాళాఖాతంలో కలిపేస్తారు: కొడాలి నాని

ఎంత మంది కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను చూసి భయపడేది లేదని అసలు వాళ్ళలో వాళ్ళకే ధైర్యం లేదని నాని వ్యాఖ్యానించారు.

Kodali Nani Comments: టీడీపీ, జనసేన, బీజేపీని మూటగట్టి బంగాళాఖాతంలో కలిపేస్తారు: కొడాలి నాని

Nani

Kodali Nani Comments: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో చేసిన కార్యాక్రమాలు ప్రజలకు వివరించి, 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల్లో నమ్మకం పెంచుకుంటామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజల సమస్యల్ని తెలుసుకుంటామని..గ్రామాల్లో బూత్ కమిటీలు, అనుబంధ కమీటీలు వేసుకొని పార్టీని సమాయత్తం చేస్తామని అన్నారు. 2024 తర్వాత మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించాలన్న అంశాలపై చర్చిస్తామని..ప్రభుత్వం, పార్టీ కలిసి పనిచేస్తాయని కొడాలి నాని అన్నారు. ఎంత మంది కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను చూసి భయపడేది లేదని అసలు వాళ్ళలో వాళ్ళకే ధైర్యం లేదని నాని వ్యాఖ్యానించారు. పవన్ పదేళ్ళ క్రితమే దత్త పుత్రుడు అయ్యాడన్న కొడాలి నాని, చంద్రబాబు, పవన్ ఎప్పుడు విడిపోయారో చెప్పాలని అన్నారు.

Also read:Nellore Shooting : నెల్లూరు కాల్పుల ఘటనలో మరో ట్విస్ట్

లోకేష్ ఒక చోట ఢింకీ కొడితే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల డింకీలు కొట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీవితమే మోసం, కుట్ర, 420, దగా అంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పవన్ రెండు సార్లు నమ్మాడని మూడో సారి కూడా నమ్ముతున్నాడని కొడాలి నాని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అందరిని మూటగట్టి ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. వీరంతా కలిసి పద్నాలుగు గంటల పాటు కలిసి కూడా ఉండలేరన్న కొడాలి నాని.. పద్నాలుగు నెలలు ఎలా కలిసి ఉంటారని ప్రశ్నించారు.

Also read:Sajjala : నారాయణ అరెస్టుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన కలిస్తే చంద్రబాబు, లోకేష్ కు అధికారం వస్తుందని పవన్ కి డబ్బు వస్తోందని కోడలి నాని వ్యాఖ్యానించారు. ఇటీవల ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజిపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు నారాయణతో కలిసి పేపర్ లీకేజీతో కుట్ర పన్నారని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తే నారాయణకి పట్టిన గతే పడుతుందని కొడాలి నాని అన్నారు. పేపరు లీకేజి, అత్యాచారాలకు పాల్పడితే నారాయణనే కాదు ఎవరిని వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు.

Also read:Taneti Vanitha : అసాని తుఫాన్ తో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హోంమంత్రి తానేటి వనిత