Buddha Venkanna: కొడాలి నాని.. దమ్ముంటే పోలీసుల్లేకుండా రా.. తేల్చుకుందాం! -బుద్దా వెంకన్న

గుడివాడ‌లో క్యాసినో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. మంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

Buddha Venkanna: కొడాలి నాని.. దమ్ముంటే పోలీసుల్లేకుండా రా.. తేల్చుకుందాం! -బుద్దా వెంకన్న

Ex TDP MLC Buddha Venkanna Fires on Kodali Nani

Buddha Venkanna: గుడివాడ‌లో క్యాసినో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. మంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కొడాలి నాని, ఏపీ డీజీపీలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి గేటు తాకినా కొడాలి నాని శవాన్ని పంపుతామంటూ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.

కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనని, కొడాలి నాని వంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటు అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో ప్రజలు కొడాలి నానిని చంపుతారని, ఈలోపే కొడాలి నాని దుబాయ్ పారిపోతాడంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా.. తేల్చుకుందాం అంటూ కొడాలి నానికి సవాలు విసిరారు బుద్దా వెంకన్న.

కొడాలి నాని వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బుద్ధా వెంకన్న.. మేమేమైనా నీ బావ ,బావమరిది అనుకున్నవా..? వాడు ,వీడు అంటున్నావు అంటూ ద్వజమెత్తారు. చంద్రబాబు వల్లే నీకు రాజకీయాల్లోకి, టీడీపీలోకి ప్రవేశం దొరికింది. హరికృష్ణను మోసం చేశావు అని అన్నారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై కూడా బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీయని, డెబ్భై ఏళ్ల వయసున్న చంద్రబాబును తిడుతుంటే డీజీపీ ఎందుకు మాట్లాడరు. కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా? అని ప్రశ్నించారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే డీజీపీ దేశంలో లేరని, ఈ డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు బుద్దా వెంకన్న.