Home » Andhrapradesh » కుప్పంకు జూ.ఎన్టీఆర్ రావాలన్న ఫ్యాన్స్..తల ఊపిన బాబు
Updated On - 4:04 pm, Fri, 26 February 21
Chittoor Kuppam : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయన పర్యటిస్తున్నారు. బాబు ఇలాకా అయిన..కుప్పంలో వెలువడిన ఫలితాలు టీడీపీని కలవరపెట్టాయి. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే.. వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి. టీడీపీకి కేవలం 13 మాత్రమే దక్కాయి. ఇలాంటి సమయంలో కుప్పంలో పర్యటిస్తున్నారు.
2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం బాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. కుప్పం, శాంతిపురం మండలాల్లో బాబుతో పాటు నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్లీలు దర్శనమివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతిపురంకు చేరుకున్న బాబు కాన్వాయ్ వద్దకు కొంతమంది చేరుకున్నారు. కుప్పంకు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలని, ఆయన్ను ప్రచారంలో దింపాలని అభిమానుల డిమాండ్ కు బాబు నవ్వుతూ తల ఊపారు. జై..బాబు..జై జై బాబుతో ఆ ప్రాంతం మారుమ్రోగింది.
కుప్పం కోటాలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలతో మారుమోగింది. గురువారం నుంచి హల్ చల్ చేస్తున్నారు. గతంలో బాబు పలుమార్లు ఇక్కడకు వచ్చినా..ఇలాంటి ఫ్లెక్సీలు కనిపించలేదు. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలకు ముందే దిశా..నిర్దేశం చేసి ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా..లేక..ఎవరికి వారు అభిమానులు ఏర్పాటు చేశారా ? అనేది ఆసక్తికరంగా మారింది.
Jr NTR: తమిళ క్రేజీ హీరోతో తారక్ మరో మల్టీస్టారర్?
జనసేనాని కోసం అభిమానుల పూజలు
Jr NTR: తారక్ పుట్టినరోజున అభిమానులకు స్పెషల్ ట్రీట్?!
AP Corna : ఏపీలో కరోనా ఉగ్రరూపం, భారీగా పెరిగిన కొత్త కేసులు, మరణాలు.. ఆ ఒక్క జిల్లాలోనే వెయ్యికిపైగా బాధితులు
Judge Ramakrishna Arrest : జడ్జి రామకృష్ణ పై దేశద్రోహం కేసు.. అరెస్ట్
Jr NTR Viral Pic: బాలరాముడిగా బుల్లి రామయ్య.. మరోసారి ఫోటో వైరల్!