ఓ పనైపోయింది : నామినేషన్ల ప్రక్రియ ముగిసింది

  • Published By: chvmurthy ,Published On : March 25, 2019 / 10:31 AM IST
ఓ పనైపోయింది : నామినేషన్ల ప్రక్రియ ముగిసింది

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీ జరిగే మొదటి విడత పోలింగ్ కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. పోటీ ఉండే అభ్యర్థులు ఎవరు అనేది తేలిపోయింది. కీలకం అయిన నామినేషన్ల దాఖలు ఘట్టాన్ని బలనిరూపణకు ఉపయోగించుకున్నారు కొందరు అభ్యర్థులు. మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టైం ఓవర్. మార్చి 26, 27 తేదీల్లో అంటే మంగళ, బుధవారాలు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 2019, మార్చి 28వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
ఏపీలోని  25 పార్లమెంట్ స్థానాలకు 250 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 175 అసెంబ్లీ సీట్లకు 1,500 మంది నామినేషన్ ఖలు చేశారు. మొత్తం ఎన్ని నామినేషన్లు పడ్డాయి అనేది అధికారికంగా తేలాల్సి ఉంది. పరిశీలన, ఉపసంహరణకు సమయం ఉండటంతో.. ఎన్ని ఉంటాయి.. ఎన్ని పోతాయి అనేది అప్పుడే క్లారిటీ రానుంది. 
తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు 400 నామినేషన్లు వేశారు. నిజామాబాద్ లో అత్యధిక సంఖ్యలో దాఖలు అయ్యాయి. మార్చి 23 తేదీ 4వ శనివారం, నిన్న ఆదివారం కావటంతో అధికారులు నామినేషన్లు స్వీకరించలేదు. సోమవారం చివరి రోజు కావటంతో నేడు భారీ సంఖ్యలో తెలంగాణలో అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. దేశవ్యాప్తంగా తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతుంది.