Donation: ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి 5లక్షల 50వేల విరాళం

కరోనా నివారణకు కోవిడ్‌-19 సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటీ 5లక్షల 50వేల రూపాయల చెక్‌ను అందజేశాయి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్టణం రీజనల్‌ ఆఫీస్‌ పరిధిలోని పరిశ్రమలు.

Donation: ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి 5లక్షల 50వేల విరాళం

Jagan

Ap CM Jagan: కరోనా నివారణకు కోవిడ్‌-19 సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటీ 5లక్షల 50వేల రూపాయల చెక్‌ను అందజేశాయి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్టణం రీజనల్‌ ఆఫీస్‌ పరిధిలోని పరిశ్రమలు.

ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ని కలిసి చెక్‌ అందించారు ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ విజయ్‌కుమార్, ఏపీపీసీబీ విశాఖపట్నం రీజనల్‌ ఆఫీసర్‌ ప్రమోద్‌కుమార్‌ రెడ్డి.

కరోనాపై పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పారిశ్రామికవేత్తలు వారికి తగ్గట్టుగా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించట్లేదని, ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. కేంద్రం పాలసీ ప్రకారం 25శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయిస్తూ ఉండగా.. ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయినట్లు సీఎం తన లేఖలో వెల్లడించారు.