New Districts : ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..!

ప్రాథమిక నోటిఫికేషన్లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

New Districts : ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..!

Ap New District

13 new districts in AP : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 జిల్లాలతో కలిపి 26 జిల్లాలు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, అభిప్రాయాలు సేకరించాలని కలెక్టర్లకు సీఎస్‌ సూచించారు. 1974 ఏపీ జిల్లాల చట్టం ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్‌ రూపొందించింది.

ఏపీలో కొత్త జిల్లాల పునర్వస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. మన్యం, అల్లూరి సీతారామారాజు, ఎన్టీఆర్, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ జిల్లాల ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా, నరసరావు పేట కేంద్రంగా పల్నాడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా ఏర్పాటు కానున్నాయి. కాగా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు మార్పు కానున్నాయి. రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాలు కొనసాగనున్నాయి.