CM Jagan-Anil Kumar : సీఎం జగన్ తో మాజీ మంత్రి అనిల్ కుమార్ భేటీ

ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ తో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భేటీ అవుతారు. ఇద్దరితో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు.

CM Jagan-Anil Kumar : సీఎం జగన్ తో మాజీ మంత్రి అనిల్ కుమార్ భేటీ

Jagan Anil

Updated On : April 20, 2022 / 4:33 PM IST

Anil Kumar meets CM Jagan : ఏపీ సీఎం జగన్ తో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. కొన్నాళ్లుగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కాకాణి, అనిల్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవలే ఒకేరోజు ఇద్దరు కూడా పోటాపోటీగా సభలు నిర్వహించారు. వారి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేసుకునే పరిస్థితి కనిపించింది. దీంతో వారిద్దరిని సీఎం జగన్, క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు. ప్రస్తుతం జగన్ తో అనిల్ భేటీ అయ్యారు.

ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ తో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భేటీ అవుతారు. ఇద్దరితో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు. ఇద్దరు నేతలు ఎవరి వర్షన్ వారు సీఎం జగన్ కు చెప్పనున్నారు. నెల్లూరు రాజకీయాలను దారిలోకి తెచ్చే పనిలో సీఎం జగన్ ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ తో జగన్ సమావేశం అయ్యారు.

Andra Pradesh : మంత్రివర్గ విస్తరణ తర్వాత..నెల్లూరు వైసీపీలో పెను మార్పులు..ఏ పరిణామాలకు దారితీయనున్నాయ్?

నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయినప్పటికీ నుంచి కూడా నెల్లూరు వైసీపీలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రధానంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని కోడ్ చేస్తూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సహకారం అందించారో అంతకంటే డబుల్ సహకారాన్ని అందిస్తానని వ్యాఖ్యలు చేశారు.

దీంతో నెల్లూరు జిల్లాలో కాకాణి, అనిల్ కుమార్ మధ్య విబేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈనేపథ్యంలో గతవారం రోజులుగా ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. కాకాణి వర్గం.. అనిల్ పై, అనిల్ వర్గం..కాకాణి, మిగిలిన నేతలపై వరుసగా విమర్శలు చేస్తున్నారు.