Pandem Kodi : పందెం కోడికోసం థాయిలాండ్ నుంచి రంగాపురానికొచ్చారు..! యాజమాని ససేమిరా అనడంతో..

థాయిలాండ్‌కు చెందిన ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో వైరల్ అయిన పందెం కోడిని కొనుగోలు చేసేందుకు రంగాపురంకు వచ్చారు.

Pandem Kodi : పందెం కోడికోసం థాయిలాండ్ నుంచి రంగాపురానికొచ్చారు..! యాజమాని ససేమిరా అనడంతో..

Thailand People

Thailand: సంక్రాంతి వచ్చిందంటే పందెం కోళ్లతో ఏపీలోని పలు జిల్లాలు సందడిగా మారుతాయి. సంవత్సరం అంతా బలమైన ఆహారం ఇచ్చి పందెం కోసం సిద్ధంచేసిన కోళ్లు.. సంక్రాంతి వచ్చిదంటే బరిలోకి దిగి సై అంటాయి. కోళ్ల మధ్య పోరాటాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచేకాక పలు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుంటారు. వేలు, లక్షల్లో పందేలు కాస్తుంటారు. కోడి పుంజుల పోరాట సన్నివేశాలు ప్రతీయేటా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇలా వైరల్ అయిన వీడియోలను థాయిలాండ్‌కు చెందిన కొందరు యువతీయువకులు చూసి ఆశ్చర్యపోయారు. వీడియోలో పందెం కోడి బరిలోకి దిగి తలపడుతున్న దృశ్యాలను చూసిన నలుగురు థాయిలాండ్ యువతీ యువకులు దానికోసం ఏకంగా ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి వచ్చారు.

Skydiving Wedding: ఇది నిజంగా వెరైటీనే..! ఎత్తైన కొండపై నుండి స్కైడైవింగ్ చేస్తూ పెళ్లిచేసుకున్న నూతన జంట.. వీడియో వైరల్

రంగాపురం గ్రామంలో నాటు కోళ్ల ఫారం నిర్వహిస్తున్న రత్తయ్య ఈ ఏడాది భోగి పండుగ రోజున తన పుంజును పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో జరిగిన కోడి పందేల పోటీల్లోకి దించాడు. ఆ పుంజుపై రూ. 27లక్షలు పెందెం వేశాడు. ఆ పుంజు అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిని చూసిన థాయిలాండ్‌కు చెందిన ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఆ పుంజును కొనుగోలు చేసేందుకు రంగాపురంకు వచ్చారు.

Odish : మహిళలు ముందుగా బస్సెక్కితే అపశకునం అట .. రవాణా సంస్థల తీరుపై ఆగ్రహం

యాజమాని కూరాకుల రత్తయ్యతో మాట్లాడి ఆ పుంజును విక్రయించాలని కోరారు. అయితే, కోడి పుంజును అమ్మేందుకు రత్తయ్య ఒప్పుకోలేదు. దీంతో థాయిలాండ్ నుంచి వచ్చిన వారు ఆ పుంజుతో ఫొటోలు దిగారు. అదే గ్రామంలో మరో పుంజును రూ. 3లక్షలకు కొనుగోలు చేసి థాయిలాండ్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.