Ganja : ఆపరేషన్ పరివర్తన్.. ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు సీఎం జగన్ ప్లాన్

గంజాయి అక్రమ రవాణను అరికట్టడమే కాదు అసలు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి లేకుండా చేయడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆపరేషన్ పరివర్తన్ కు శ్రీకారం చుట్టింది. మూడు నెలల్లో గంజాయి సాగు..

Ganja : ఆపరేషన్ పరివర్తన్.. ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు సీఎం జగన్ ప్లాన్

Ganja

Ganja : గంజాయి అక్రమ రవాణను అరికట్టడమే కాదు అసలు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి లేకుండా చేయడానికి ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆపరేషన్ పరివర్తన్ కు శ్రీకారం చుట్టింది. మూడు నెలల్లో గంజాయి సాగు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గంజాయి పంటను తొలగిస్తున్నారు.

WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!

ఏపీలో గంజాయి విక్రయాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలి రాజకీయంగా సంచలనం రేపింది. పలు రాష్ట్రాల్లో పట్టుబడ్డ స్మగ్లర్లు తాము గంజాయిని విశాఖ నుంచి తీసుకొచ్చామని చెప్పారు. గంజాయికి విశాఖ అడ్డాగా మారిందనే విమర్శలు వచ్చాయి. దీంతో గంజాయి అక్రమ రవాణను అరికడుతూనే, గంజాయి పంటను లేకుండా చేయాలని ప్రభుత్వం భావించింది.

మూడు రోజుల క్రితం తెలంగాణ, ఒడిశా, కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ, ఎన్ ఫోర్స్ మెంట్, ఎక్సైజ్ అధికారులు సమావేశం అయ్యారు. గంజాయి నిర్మూలనపై చర్చించారు.

Google Chrome Warn : క్రోమ్‌ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి!

మూడు రోజులుగా విశాఖలో గంజాయి పంటలను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. గంజాయి పంటలు ధ్వంసం చేయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ సహకారంతో 800మంది సిబ్బందితో 10 బృందాలు ఏర్పాటు చేశామన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. జి.మాడుగుల, జీకే వీధి మండలాల్లోని 270 ఎకరాల్లో ఉన్న గంజాయి పంటను ధ్వంసం చేశామన్నారు. గంజాయి పంట ధ్వంసానికి గ్రామస్తులు సహకరిస్తున్నారని డీజీపీ చెప్పారు. మొత్తం 400 ఎకరాల్లో హైబ్రిడ్ గంజాయి సాగు అవుతోందన్నారు.