Mekapati Goutham Reddy : ముగిసిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు

అంతిమయాత్రలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు...మేకపాటి గౌతమ్ రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. బుచ్చి, సంగం, నెల్లూరి పాలెం గ్రామాల మీదుగా...

Mekapati Goutham Reddy : ముగిసిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు

Mekapati Minister

Goutham Reddy Funeral : ఏపీ ప‌రిశ్రమ‌లు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఉదయగిరి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు, మేకపాటి కుటుంబసభ్యులు, అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియలకంటే ముందు…మేకపాటి గౌతమ్ రెడ్డి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. బుచ్చి, సంగం, నెల్లూరి పాలెం గ్రామాల మీదుగా ఆయన అంతిమయాత్ర కొనసాగింది. దారి పొడువున పాల్గొన్న ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు. కన్నీటి పర్యంతం అవుతూ.. నివాళులర్పించారు.

Mekapati

Mekapati

Read More : Mekapati Gautam Reddy : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం

జూబ్లీహిల్స్ లో గుండెపోటుతో : –
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. సీఎం జగన్ దంపతులు కూడా హైదరాబాద్ కు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ సభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇటీవలే ఆయన దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి స్టాల్ ను ప్రారంభించి.. ఇండస్ట్రీ అవకాశాల గురించి వివరించారు.

 

AP Minister Mekapati Goutham Reddy

AP Minister Mekapati Goutham Reddy

Read More : Mekapati Goutham Reddy: దుబాయ్‌లోనే ఇబ్బంది పడ్డట్టుగా గౌతమ్‌రెడ్డి కదలికలు..!

నెల్లూరుకు మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థీవదేహం : –
గౌత‌మ్ రెడ్డి అంత్యక్రియ‌ల నిర్వహ‌ణ స‌మ‌న్వయ‌క‌ర్తగా విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్‌ను సీఎం జ‌గ‌న్ నియ‌మించారు. అదేవిధంగా జిల్లా మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను లోకల్‌గా ఏర్పాట్లు చూడాల్సిందిగా ఆదేశించారు. 2022, ఫిబ్రవరి 22వ తేదీ మంగళవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన పార్థీవదేహాన్ని నెల్లూరుకు తరలించారు. రేణిగుంటకు చేరుకున్న అనంతరం నెల్లూరులోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. 2022, ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం . మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. గౌతమ్ రెడ్డి కుమారుడు అమెరికా నుంచి వచ్చారు.

Mekapati Gautham Reddy Thumb

Mekapati Gautham Reddy Family

Read More : Mekapati Goutham Reddy: నెల్లూరుకు చేరిన మేకపాటి గౌతమ్ పార్థివ దేహం.. Live Updates

మృతిపై క్లారిటీ ఇచ్చిన కుటుంబసభ్యులు : –
అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సోషల్ మీడియా రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. దీనిని కుటుంబసభ్యులు ఖండించారు. పెళ్లి వేడుకకు వెళ్లి రాత్రి 9.45 గంటలకు ఇంటికి తిరిగొచ్చినట్లు, ఎప్పటిలాగానే సోమవారం ఉదయం 6గంటలకు గౌతమ్‌ రెడ్డి లేచినట్లు తెలిపారు. 6.30గంటల వరకు ఇతరులతో మాట్లాడి.. ఉదయం 7గంటలకు ఇంట్లోని సోఫాలో కూర్చొన్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7.12 గంటలకు డ్రైవర్‌ని పిలవమని వంటమనిషికి చెప్పడం, 7.15గంటలకు గుండెపోటుతో సోఫా నుంచి కిందకు ఒరిగడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన డ్రైవర్ నాగేశ్వరరావు 7.18గంటలకు మంత్రి ఛాతిపై చేయి వేసి రుద్దుతూ ఉపశమనం కలిగించినట్లు, 7.20 గంటలకు గౌతమ్‌ రెడ్డి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం అయ్యారన్నారు.

Read More : Mekapati Goutham Reddy Live update: ఏపీ మంత్రి మేకపాటి కన్నుమూత.. లైవ్ అప్ డేట్స్

రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం : –
7.22 గంటలకు గుండెనొప్పి వస్తోందని గౌతమ్‌ రెడ్డి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్దామంటూ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారుఉదయం 7.27 గంటలకు ఇంటి నుంచి ఆస్పత్రికి ఐదు నిమిషాల్లో చేరుకుని, అత్యవసర విభాగానికి డ్రైవర్‌, సిబ్బంది తీసుకెళ్లారన్నారు. ఉదయం 9.13 గంటలకు గౌతమ్‌ రెడ్డి మరణించారని డాక్టర్లు నిర్ధారించినట్లు గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. 1971లో మేకపాటి గౌతమ్ రెడ్డి జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లో రెండుసార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి పనిచేస్తున్నారు.