Gudivada Amarnath: ఆంధ్రలోనే ఎకరం అమ్మితే తెలంగాణలో 50 ఎకరాలు కొనొచ్చు: కేసీఆర్‌కి ఏపీ మంత్రి కౌంటర్

హైదరాబాద్ గురించి కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాల గురించి కేసీఆర్ మాట్లాడాలని విమర్శించారు.

Gudivada Amarnath: ఆంధ్రలోనే ఎకరం అమ్మితే తెలంగాణలో 50 ఎకరాలు కొనొచ్చు: కేసీఆర్‌కి ఏపీ మంత్రి కౌంటర్

Gudivada Amarnath

Gudivada Amarnath – CM KCR : తెలంగాణ(Telangana)లో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో 50 ఎకరాల భూమి కొనొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. అమరావతిలో అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరాలు తెలిపారు.

ఆంధ్రలోనే ఎకరం అమ్మితే తెలంగాణలో 50 ఎకరాలు కొనొచ్చని అమర్‌నాథ్ చెప్పారు. వైజాగ్ లో ఎకరం అమ్మితే.. హైదరాబాద్ లో మూడు ఎకరాలు కొనవచ్చని కూడా అమర్‌నాథ్ అన్నారు. హైదరాబాద్ గురించి కాకుండా తెలంగాణలోని మిగతా ప్రాంతాల గురించి కేసీఆర్ మాట్లాడాలని అన్నారు.

ఏపీలోని ప్రతిపక్ష నేతలకూ అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. రూ.1,400 కోట్ల పెట్టుబడులతో మూడు జిల్లాల్లో నాలుగు పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో జరిగిన ఎంఓయూలో భాగంగా ఈ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఏపీకి పరిశ్రమలు రావడం లేదని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.

తమ రాష్ట్రానికి జగన్ ఒక్కరే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకొచ్చారు. 2014 నుంచి పరిశ్రమలను ఎన్ని ఇబ్బందులు పెట్టారో పవన్ కల్యాణ్ చూడలేదని అన్నారు. నాలుగేళ్లుగా హైదరాబాద్ లో ఉన్న పవన్ ఇప్పుడు జగన్ ని ఇంటికి పంపుతానని అంటున్నారని చెప్పారు. చంద్రబాబు వల్లే పవన్ కల్యాణ్ కి ప్రాణహాని ఉంటుందని తెలిపారు.

చంద్రబాబు కంటే ఎక్కువ ఫోకస్ అయిన వ్యక్తులు కనుమరుగవుతున్నారని అన్నారు. టీడీపీలో నంబర్ 2గా ఎదుగుతున్న హరికృష్ణ, బలయోగి, మాధవ్ రెడ్డి ఇలా అనేక మంది అనుమానాస్పదంగా చనిపోయివారేనని చెప్పుకొచ్చారు. తనతో పాటు ఎవరు ఎదుగుతున్నా వారిని చంద్రబాబు ఉండనివ్వరని ఆరోపించారు.

CM KCR : తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబే అన్నారు : కేసీఆర్