Gudivada Amarnath : తల్లిని ఎవరు తిట్టకపోయినా కేసులు పెట్టిన లోకేష్.. ఇప్పుడు తండ్రి మీద వచ్చిన కథనంపై కేసులు వేస్తారా : మంత్రి గుడివాడ

రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు.

Gudivada Amarnath : తల్లిని ఎవరు తిట్టకపోయినా కేసులు పెట్టిన లోకేష్.. ఇప్పుడు తండ్రి మీద వచ్చిన కథనంపై కేసులు వేస్తారా : మంత్రి గుడివాడ

Gudivada Amarnath (1)

Gudivada Amarnath – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హిందూస్తాన్ టైమ్స్ కథనంతో చంద్రబాబు అవినీతి బహిర్గతం అయ్యిందన్నారు. హిందూస్తాన్ కథనాన్ని ఎందుకు ఖండించలేదని నిలదీశారు. తల్లిని ఎవరు తిట్టక పోయినా కేసులు పెట్టిన లోకేష్.. ఇప్పుడు ఆయన తండ్రి మీద వచ్చిన కథనంపై కేసులు వేస్తారా అని అన్నారు. ‘నాకు చంద్రబాబుకు సంబంధం లేదని లోకేష్ ఊరు కుంటారా’ అని అడిగారు.

ఈ మేరకు శుక్రవారం మంత్రి గుడివాడ అమర్నాథ్  విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఒక ఆంగ్ల పత్రిక చంద్రబాబుకు ఐటీ షోకాజ్ నోటీస్ ఇచ్చిన అంశాన్ని లేవనెత్తిందని తెలిపారు. చంద్రబాబు ఏ విధంగా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించారనే అంశంపై కథనం ప్రచురించారని పేర్కొన్నారు. ‘అవినీతి అంటే నాకు తెలియదు అని చెప్పే అవినీతి చక్రవర్తి ఎందుకు నోరు మెదపడం లేదు’ అని ప్రశ్నించారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు సర్వం సిద్ధం.. సెప్టెంబర్‌లోనే వారాహి మరో యాత్ర

రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు. తల్లిని రాజకీయాలకు వాడుకున్న లోకేష్ కు చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడే దైర్యం ఉందా అని ప్రశ్నించారు. రెండు ఎకరాల నుంచి లక్షల కోట్లకు ఎలా ఎదిగారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ మధ్య కాలంలో ఎందుకు చంద్రబాబు ఆయన ఆస్తులు ప్రకటించలేదని నిలదీశారు. హెరిటేజ్ వల్లనే లక్షల కోట్లు ఆదాయం సంపాదించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్ర ఖజానాను దోచేశారని ఆరోపించారు. అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే అది చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. ‘రాజకీయాల్లోకి రాక ముందు మీ ఆస్తులు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రజలకు తెలుసు’ అని అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి ఆయన పీఏ శ్రీనివాస్ చెప్పారని తెలపారు.

Padmasree Sunkara: బీజేపీ వాళ్లు దేశ వ్యాప్తంగా మట్టిని సేకరిస్తారట.. సిగ్గుండాలి: ఏపీసీసీ ఆగ్రహం

అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇస్తామని చెపుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన అమలు చేశారా? అని ప్రశ్నించారు. రూ.86 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారని తెలపారు.

రూ.16,000 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఆడపిల్ల పుడితే రూ.25 వేలు మహిళా ఖాతాల్లో వేస్తామని చెప్పారని వెల్లడించారు. ఇంటికొక ఉద్యోగం లేకపోతే రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఎక్కడైనా ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేశారా అని అన్నారు. చంద్రబాబు సీఎం జగన్ తో పాటు మేనిఫెస్టో పక్క రాష్ట్రాల హామీలను కాఫీ కొట్టారని పేర్కొన్నారు. స్కాంల పితామహుడు చంద్రబాబు, ఇక స్కీంలు ఏమీ ఇస్తారని ఎద్దేవా చేశారు.