Heavy Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వ‌ర్షాలు.. ఆ జిల్లాల్లో ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

తెలుగు రాష్ట్రాల‌ను వ‌రుణుడు వీడ‌టం లేదు. గ‌త ప‌దిహేను రోజులుగా ఏదోఒక ప్రాంతంలో వ‌ర్షం కురుస్తూనే ఉంది. తాజాగా రెండు రాష్ట్రాల్లో వ‌రుణుడు దంచికొడుతున్నాడు.

Heavy Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వ‌ర్షాలు.. ఆ జిల్లాల్లో ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

Heavy Rain

Heavy Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల‌ను వ‌రుణుడు వీడ‌టం లేదు. గ‌త ప‌దిహేను రోజులుగా ఏదోఒక ప్రాంతంలో వ‌ర్షం కురుస్తూనే ఉంది. తాజాగా రెండు రాష్ట్రాల్లో వ‌రుణుడు దంచికొడుతున్నాడు. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీరప్రాంతం, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. దీంతో వచ్చే రెండు మూడు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, విదర్భ, గుజరాత్, కొంకణ్ , గోవా, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లోని త‌దిత‌ర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Telugu States Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న వాయుగుండం..మూడు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇప్ప‌టికే సోమ‌వారం అనేక జిల్లాల్లో వ‌ర్షం కురిసింది. అయితే నేడు, రేపు కూడా తెలంగాణ‌లో వ‌ర్షం కురుస్తుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్ర‌క‌టించిన వాతావ‌ర‌ణ శాఖ నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట్‌, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌న‌గర్, నారాయణపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి వ‌ర్షం ప‌డుతూనే ఉంది. ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు వ‌ర్షం కురియ‌గా.. ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రహ‌దారుల‌పైకి నీరుచేరి వాహ‌న‌దారులు రాక‌పోక‌లు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మ‌రోవైపు నేడు, రేపు భాగ్య‌న‌గ‌రంలో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు కుంభవృష్టి ముప్పు..

బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకొని కొనసాగుతు వాయువ్య దిశగా తీవ్ర అల్ప‌పీడ‌నం పయనిస్తోంది. దీంతో దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంద‌ని, మంగ‌ళ. బుధ వారాల్లో మత్యకారులు వేటకు వెళ్లకూడద‌ని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్ప‌పీడ‌నం ప్ర‌భావంతో ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. సోమ‌వారం అల్లూరి సీతారామ‌రాజు, పార్వ‌తీపురం మ‌న్యం, తూర్పుగోదావ‌రి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాప‌ట్ల, నంద్యాల జిల్లాల్లో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా చితంప‌ల్లిలో అత్యధికంగా 9.5 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది.