Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు కుంభవృష్టి ముప్పు..

తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం ఉందని తెలిపింది.

Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు కుంభవృష్టి ముప్పు..

Heavy Rains: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిరోజూ ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే మరోసారి రాష్ట్రంలో కుంభవృష్టి ముప్పు పొంచిఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం అతి భారీ వర్షాలు ఉంటాయని సూచించారు. ఉరుములు, మెరుపులతో పాటు గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Heavy Rain : తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్షాలు..హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు వారాలుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాతాల్లో అన్నదాతలు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 7 నుంచి 9 తేదీల మధ్య అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా 8,9 తేదీల్లో 20 సెం.మీ వర్షపాతంకు మించి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఈ విషయంపై వాతావరణ కేంద్రం అధికారులు ప్రభుత్వానికి, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలకు (ఎన్టీఆర్ఎఫ్) సమాచారం అందించారు.

Hyderabad Heavy Rain : హైదరాబాద్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ భారీ వర్షం

7వ తేదీ తరువాత వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాటి పరిసర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురస్తాయని తెలిపింది. గురువారంసైతం అనేక జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా గంగాధరలో 15.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.