G Kothapalli : జి.కొత్తపల్లిలో హై టెన్షన్.. పోలీసుల రక్షణలో ఎమ్మెల్యే తలారీ

ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో హై టెన్షన్ కొనసాగుతోంది. వైసీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చివరకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి కారణమైంది. ఎమ్మెల్యేను పోలీసులు ఆందోళనకారుల నుంచి సురక్షితంగా...

G Kothapalli : జి.కొత్తపల్లిలో హై టెన్షన్.. పోలీసుల రక్షణలో ఎమ్మెల్యే తలారీ

Ganji Prasad

YCP MLA Talari Venkatrao : ఏపీలో రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా.. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో హై టెన్షన్ కొనసాగుతోంది. వైసీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చివరకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడికి కారణమైంది. ఎమ్మెల్యేను పోలీసులు ఆందోళనకారుల నుంచి సురక్షితంగా వేరే ప్రాంతానికి తీసుకువెళ్లినా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేను ఉంచిన ఇంటిని వైసీపీకి చెందిన రెండు వర్గాలు చుట్టు ముట్టాయి. స్థానికులు పోలీసుల వాహనాల్లో గాలి తీసేశారు. ఎమ్మెల్యే బయటకు వస్తే మరోసారి దాడి జరిగే ప్రమాదముండటంతో ఆయన్ను ఎలా ఊరి దాటించాలా అన్న టెన్షన్‌లో పోలీసులు ఉన్నారు. ఎమ్మెల్యే చుట్టూ నిలబడి.. పోలీసులు ఆయనకు రక్షణ వలయంగా నిలబడ్డారు. ప్రస్తుతం గ్రామానికి పోలీసులు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. అదనపు బలగాలు వచ్చాక గ్రామం నుంచి ఎమ్మెల్యేని తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read More : Krishna : తల్లితో సహజీవనం‌ చేస్తూనే..ఆమె కూతురిపై 10 నెలలుగా అత్యాచారం

ఏలూరు జిల్లాలో వైసీపీ వర్గ విభేదాలు ఒకరి హత్యకు, ఎమ్మెల్యేపై దాడికి దారితీశాయి. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ హత్యతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం గంజిప్రసాద్ హత్య జరిగింది. ఆయన కుటుంబాన్ని పరామర్శించేదుకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జి. కొత్తపల్లి వెళ్లారు. ఆయన వచ్చిన సమాచారం తెలుసుకున్న వ్యతిరేక వర్గీయలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి.

Read More : Andhra Pradesh : YCP నాయకుడు హత్య..పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల దాడి

చనిపోయిన గంజిప్రసాద్ తలారి వెంకట్రావు వర్గానికి చెందినవారు. గంజిప్రసాద్ వర్గాన్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఎప్పటినుంచో వ్యతిరేక వర్గ గ్రామస్థులు ఆగ్రహంతో ఉన్నారు. గంజిప్రసాద్‌ను హత్య చేసింది కూడా ప్రత్యర్థి వైసీపీ వర్గం వారనే భావిస్తున్నారు. పరామర్శకు ఎమ్మెల్యే గ్రామానికి రావడంతో.. ఎన్నాళ్ల నుంచో కాచుక్కూచున్న ప్రత్యర్థి వర్గీయులు ముందూ వెనకా ఆలోచించకుండా దాడి చేశారు. అక్కడ పోలీసులు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో తలచుకోవడానికే భయమేస్తుందంటున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. అధికార పార్టీలో వర్గ విభేదాలతో హత్యల దాకా పరిస్థితి వెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read More : Woman Marries Cat : పిల్లిని పెండ్లి చేసుకున్న మహిళ.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఎప్పుడేం జరిగింది ?
ఉదయం 8 గంటలకు గంజి ప్రసాద్ హత్య జరిగింది.
ఉదయం 9:30కు గ్రామానికి ఎమ్మెల్యే వెంకట్రావు చేరుకున్నారు.
9:45 కు కుటుంబ సభ్యులను పరామర్శించారు
అనంతరం ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు.
ఉదయం 10.00 గంటలకు ఎమ్మెల్యేను సురక్షిత ప్రాంతానికి పోలీసులు తరలించారు.