Amit Shah: డ్రగ్స్ కట్టడి చేయండి.. సీఎంలకు అమిత్‌షా సూచన
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో డ్రగ్స్ కట్టడికి సీఎంలు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.

Amit Sha (1)
Amit Shah: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో డ్రగ్స్ కట్టడికి సీఎంలు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యేందుకే ఇటువంటి సమావేశాలు ఉంటాయని అభిప్రాయపడ్డ అమిత్‌షా.. ఈ సమావేశంలో మొత్తం పెండింగ్‌లో ఉన్న 51 సమస్యల్లో 40పరిష్కారమైనట్లు చెప్పారు.
ప్రతి రాష్ట్రం కనీసం ఒక ఫోరెన్సిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని, ఫోరెన్సిక్ కళాశాల సిలబస్ స్థానిక భాషలోనే ఉండేలా చూడాలన్నారు అమిత్ షా. డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల విచారణ వేగవంతం చేయాలని, అందుకోసం స్వతంత్ర సంస్థలు నియమించాలని అమిత్ షా సీఎంలకు సూచించారు.
అలాగే పోక్సో నేరాలు జీరో శాతం అయ్యేలా పనిచేయాలని కోరారు అమిత్ షా. పిల్లలపై నేరాలు ఆమోదయోగ్యం కాదని అన్న అమిత్‌షా.. ఈ కేసులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోక్సో కేసుల దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు.
Amit Shah: ఏపీ, తెలంగాణ సమస్యలపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా
భారత్‌లో ఇప్పటివరకు 111కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేయడం విజయవంతమైన సమాఖ్య వ్యవస్థ గొప్పదనానికి నిదర్శనమన్నారు కేంద్ర హోంమంత్రి. సహకార సమాఖ్య విధానం ద్వారానే దేశ సమగ్రాభివృద్ధి సాధించగలమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విశ్వసిస్తున్నారని తెలిపారు. ఇవాళ ఏపీ బీజేపీ నేతలతో సమావేశమై తర్వాత ఢిల్లీకి బయల్దేరుతారు అమిత్ షా.
Journalists: ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లు అరెస్ట్