Journalists: ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లు అరెస్ట్

త్రిపుర పోలీసులు ఇద్దరు మహిళా జర్నలిస్టులు సమృద్ధి సకునియా, స్వర్ణ ఝాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Journalists: ఇద్దరు మహిళా జర్నలిస్ట్‌లు అరెస్ట్

Journalists

Journalists: మసీదును ధ్వంసం చేశారన్న ఆరోపణలతో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో త్రిపుర పోలీసులు ఇద్దరు మహిళా జర్నలిస్టులు సమృద్ధి సకునియా, స్వర్ణ ఝాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అసోంలోని నీలం బజార్‌లో తప్పుడు సమాచారంతో రిపోర్టింగ్ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇద్దరు మహిళా జర్నలిస్టులను అసోం పోలీసుల సహకారంతో త్రిపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సీనియర్ పోలీసు అధికారి వెల్లడించింది. అయితే, జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

విశ్వ‌హిందూ ప‌రిష్‌త్‌కు చెందిన కార్య‌క‌ర్త కాంచ‌న్ దాస్ ఫిర్యాదు మేర‌కు స‌మృద్ధి, స్వ‌ర్ణ ఝాలపై మ‌హిళా జ‌ర్న‌లిస్టులు వార్త‌ల క‌వ‌రేజీ అన్నీ వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌తప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌ల‌కు కారణమవుతుందని ఫిర్యాదులో వెల్లడించారు. మ‌త విధ్వేషాలు రెచ్చ‌గొట్టిన నేరానికి ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 153-ఎ కింద‌, నేర‌పూరిత కుట్రకుగాను సెక్ష‌న్‌ 120(బీ) కింద కేసులు న‌మోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

పోలీసులు కేసులు పెట్టడంపై సదరు మహిళా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బెదిరించారని ఆరోపించారు. హింసాత్మ‌క ఘ‌ట‌ల‌ను క‌వ‌ర్ చేయడం నేరమా? మ‌త ఘ‌ర్ష‌ణ‌లు రెచ్చ‌గొట్ట‌డం ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

నిందితులపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 153బీ, 193, 504, 120బీ, 204 కింద పోలీసులు అభియోగాలు మోపారు.