Botsa On Amma Vodi : లక్షమందికి పైగా అమ్మఒడి కోత..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో లబ్దిదారుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించిందని, లబ్దిదారుల సంఖ్యలో లక్షమందికిపైగా కోత వేసిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

Botsa On Amma Vodi : లక్షమందికి పైగా అమ్మఒడి కోత..! మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Botsa On Amma Vodi

Botsa On Amma Vodi : అమ్మఒడి పథకం మూడో విడత సాయంలో లబ్దిదారుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం భారీగా తగ్గించిందని, లబ్దిదారుల సంఖ్యలో లక్షమందికిపైగా కోత వేసిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. అధికార పార్టీ టార్గెట్ గా ప్రతిపక్ష టీడీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. సీఎం జగన్ మాట తప్పారని, నిబంధనల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

తొలి విడతలో ఎలాంటి నిబంధనలు లేకుండా సాయాన్ని అందించిన ప్రభుత్వం.. తాజాగా మార్గదర్శకాలు విడుదల చేయడంతో చాలామంది ఈ పథకం ప్రయోజనాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అమ్మఒడి కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మూడో విడత సాయంలో రూ.2వేలు కోత విధించి రూ.13వేలే ఇస్తామని ప్రకటించింది. మరోవైపు కరెంట్ వాడకం, పిల్లల హాజరు వంటి నిబంధనలు పెట్టడంతో పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.(Botsa On Amma Vodi)

Andhra Pradesh: 27న అమ్మఒడి పథకం నిధుల విడుదల.. లక్ష మందికిపైగా కోత

ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అమ్మఒడి లబ్దిదారుల సంఖ్య తగ్గిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి బొత్స చెప్పారు. విద్యార్థుల హాజరు(అటెండెన్స్) ఆధారంగానే పథకం వర్తిస్తుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పిల్లలను సక్రమంగా స్కూల్ కి పంపితేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని మంత్రి బొత్స తేల్చి చెప్పారు. అమ్మఒడి పథకం లబ్దిదారుల వాటాగా రెండు వేల రూపాయలను పాఠశాల నిర్వహణ కోసం కేటాయించామన్నారు బొత్స. పదో తరగతి కంటే ఇంటర్ ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారాయన. స్కూల్, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి బొత్స.

”విద్యాసంస్థల్లో 75శాతం హాజరున్న పిల్లలకు మాత్రమే అమ్మఒడి ఇస్తున్నాం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించి తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్లి బుద్ధిగా చదువుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అమ్మఒడి సాయంలో రూ.2వేల కోత విధిస్తున్న మాట వాస్తవమే. అందులో వెయ్యి రూపాయలు స్కూల్ మెయింట్‌నెన్స్ కోసం, మరో వెయ్యి రూపాయలు వాచ్‌మెన్‌ జీతంతో పాటు ఇతర అవసరాలకు వినియోగిస్తాం” అని మంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు.

కాగా, ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6వేల 500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

Amma Vodi : అమ్మఒడి డబ్బులు.. ప్రభుత్వం కొత్త రూల్

అయితే ఈ ఏడాది అమ్మఒడి లబ్దిదారులకు జగన్ సర్కార్ భారీ షాక్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో అమ్మఒడి లబ్దిదారుల సంఖ్యలో వివిధ కారణలతో ప్రభుత్వం లక్ష మందికిపైగా కోత పెట్టిందని తెలుస్తోంది. స్కూళ్లకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని అనర్హులుగా తేల్చిన ప్రభుత్వం.. వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసినట్టు తెలుస్తోంది.

‘‘ విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదు. నవంబర్ 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా అమ్మఒడి ప్రయోజనం పొందలేరు. బియ్యం కార్డు కొత్తది ఉండాలి. కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్‌లో జిల్లా పేరును మార్చుకోవాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలి’’ అని ఈ పథకానికి అర్హతలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులు అయినట్లు తెలుస్తోంది. ఏకంగా లక్షమందికిపైగా లబ్దిదారులు.. ఈ పథకానికి అనర్హులు అయ్యారనే వార్త దుమారం రేపుతోంది. వాస్తవానికి ఈ నెల 23 తేదీన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాన్ని వివిధ కారణాల వల్ల వాయిదా వేసింది ప్రభుత్వం.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

జగన్ సీఎం అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల్లో జగనన్న అమ్మఒడి పథకం అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.

మొదట 2022 జనవరిలో ఈ నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. వివిధ కారణాలతో అమ్మ ఒడి డబ్బుల విడుదలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది.