Andhra Pradesh: 27న అమ్మఒడి పథకం నిధుల విడుదల.. లక్ష మందికిపైగా కోత 

 అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ స‌ర్కారు శుభ‌వార్త తెలిపింది. ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Andhra Pradesh: 27న అమ్మఒడి పథకం నిధుల విడుదల.. లక్ష మందికిపైగా కోత 

Amma Vodi

Andhra Pradesh: అమ్మఒడి పథకం లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ స‌ర్కారు శుభ‌వార్త తెలిపింది. ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. అమ్మఒడి కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 కోట్లు కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికిపైగా కోత పెట్టింది.

presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము

అంటే, పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చగా, వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది. కాగా, జగన్ అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేస్తున్నారు. వారికి ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇస్తున్నారు. అయితే, అమ్మఒడి సాయంలో ఈ ఏడాది మాత్రం లబ్ధిదారులందరికీ రూ.2వేలు కోత పడుతోంది.