Indigo started services from orvakal : కర్నూలు నుంచి ప్రారంభమైన విమాన సర్వీసులు

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. 52 మంది ప్రయాణికులతో బెంగుళూరు నుంచి వచ్చిన 6E 7911 ఇండిగో విమానం ఈ ఉదయం ఓర్వకల్లు చేరుకుంది.

Indigo started services from orvakal : కర్నూలు నుంచి ప్రారంభమైన విమాన సర్వీసులు

Orvakal Air Port Services

Updated On : March 28, 2021 / 1:29 PM IST

Indigo air lines started services from orvakal airport : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. 52 మంది ప్రయాణికులతో బెంగుళూరు నుంచి వచ్చిన 6E 7911 ఇండిగో విమానం ఈ ఉదయం ఓర్వకల్లు చేరుకుంది.

రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని లు తొలి విమాన సర్వీసు లో వచ్చిన ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది.

అనంతరం  ఓర్వకల్లు నుంచి విశాఖ వెళ్లే విమానాన్ని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఓర్వకల్లు నుంచి 3 ప్రధాన నగరాలకు ఇండిగో  విమానయాన సంస్ధ సర్వీసులను నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం మార్చి25న, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.