Chandrababu Naidu : విశాఖను ఆర్థిక రాజధాని చేసిన ఘనత మాదే, పేదలకు అండగా ఉండే ప్రభుత్వం రావాలి- చంద్రబాబు నాయుడు

రాబోయే 20 ఏళ్లలో ఏం జరుగుతుందో చెప్పడానికి విజన్ 2047 రూపొందించాను. తెలుగు జాతి.. దేశం, ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలన్నదే విజన్ 2047 అని చంద్రబాబు తెలిపారు. Chandrababu Naidu - Visakhapatnam

Chandrababu Naidu : విశాఖను ఆర్థిక రాజధాని చేసిన ఘనత మాదే, పేదలకు అండగా ఉండే ప్రభుత్వం రావాలి- చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu Vision 2047

Updated On : August 15, 2023 / 11:08 PM IST

Chandrababu Naidu – Visakhapatnam : విశాఖను ఆర్ధిక రాజధాని చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు చంద్రబాబు నాయుడు. విశాఖ సుందరమైన నగరం అని, తనకు ఇష్టమైన నగరం అని ఆయన చెప్పారు. వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం విశాఖ అని అన్నారు. సమైక్యాంధ్ర ఉన్నప్పుడే విశాఖను ఆర్థిక రాజధాని చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది చంద్రబాబు చెప్పారు. విజన్ 2047 ను చంద్రబాబు విడుదల చేశారు. తెలుగు జాతి.. దేశం, ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలన్నదే విజన్ 2047 అని చంద్రబాబు తెలిపారు.

”విశాఖలో హూదూద్ వచ్చి నా మనసు విరిగిపోయింది. నేనే అధైర్యపడితే ఎలా? అని పూర్వ వైభవం తెచ్చేలా విశాఖ కోసం పని చేశా. ఆ సమయంలో ప్రధాని వచ్చినా ఘనంగా స్వాగతం పలికాము. అది చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు. దీపావళికి టపాసులు కాల్చవద్దని ఒక్కమాట చెబితే విని అది పాటించారు. అంత గొప్ప మనస్సు విశాఖ ప్రజలది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిపించి అభిమానం చాటుకున్నారు.

Also Read..pawan kalyan : జనసేన ప్రజాకోర్టు కార్యక్రమం .. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : పవన్‌ కల్యాణ్

తెలుగు వారి ఆత్మగౌరవం నిలిపిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ వారసులుగా తెలుగువారిగా మన సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలి. రాబోయే 20 ఏళ్లలో ఏం జరుగుతుందో చెప్పడానికి విజన్ 2047 రూపొందించాను. 76ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఇంకా అవినీతి పోలేదు. కర్పషన్ ప్రీ దేశంగా మనం చెయ్యాలి. రాబోయే రోజుల్లో పేదలకు అండగా ఉండే వాళ్లు రావాలి. రాబోయే వందేళ్లు యువతదే. ప్రపంచంలో ఎక్కడ చూసినా టాప్ ప్లేస్ లో తెలుగు వారే ఎక్కువ ఉన్నారు. ఏపీ అయినా తెలంగాణ అయినా దేశంలో ఏ ప్రాంతంలో అయినా తెలుగు వారిని ప్రోత్సహించడానికి టీడీపీ అండగా ఉంటుంది” అని చంద్రబాబు అన్నారు.

Also Read..Balineni Srinivasa Reddy : వచ్చే ఎన్నికల్లో నా నియోజకవర్గం అదే.. బాలినేని క్లారిటీ.. మాగుంట విషయంపైనా స్పష్టత..